నీ గోత్రమేమి? ఏ ఊరు వాడవు
ఒంటరిగా ఈ దండకారణ్యమున
సంచరించుటకు కారణమేమి తెలుపుము?
సీతాదేవడిగిన ప్రశ్నలకు రావణుడిట్లనెను
ఓ సీతా!నాపేరు రావణుడు నేను రాక్షసరాజును
దేవతలు,మునులు,నాగులు నాకు
భయపడెదరని గర్వముతో పలికెను.
ఓ సుందరీ! పట్టు వస్త్రములు ధరించి
బంగారు కాంతితో విరాజిల్లుచున్న
నిన్ను జూచినది మొదలుకొని
నా భార్యలను మరిచిపోతిని.
నన్ను పతిగా స్వీకరించినచో
నీవు పట్టమహిషివి కాగలవు
అప్పుడు వారు నిన్ను సేవింతురు
అందమైన లంకానగరము నా రాజధాని
పరమపతివ్రతయైన ఆ జానకి
రావణుని పలుకులకు మండిపడి
అతనిని తృణీకరించుచు ఇట్లు పలికెను
ఓ రావణా!నా పతిగూర్చి తెలుపెద వినుము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి