ఆ సీతాదేవి పుష్పములతో ఇలా అంటుంది
రావణుడు నన్ను అపహరించిన విషయాన్ని
ఓ పువ్వుల్లారా! రామునికి తెలుపుము
ఓ గోదావరీ తల్లీ! నీకు ప్రణమిల్లుచున్నాను
ఈ రాక్షసుని గూర్చి రామునికి తెలుపుము
ఓ పక్షుల్లారా నా గూర్చి లక్ష్మణునికి తెలుపుము
ఓ సమస్త ప్రాణుల్లారా నా భర్తకు తెలుపుము.
శ్రీరాముడు మహాబుజభలశాలి
యముడు అపహరించుకొని పోయినను
ఆ విషయము నెరంగి ఆ పరలోకమునుండైన
నన్ను తీసుకొని రాగలడు.
విశాలాక్షియైన సీతాదేవి మిక్కిలి దుఃఖముతో
దయానియ వచనములతో విలపించుచు
చెట్టు పై యున్న జటాయువు పక్షిని చూచెను
సీత వెంటనే ఆపక్షిని ఇట్లు వేడుకొనెను.
పూజ్యుడైన ఓ జటాయూ!ఈ రాక్షసుడు
నన్ను అపహరించుకొని పోవుచున్నాడు
అపహరించుకొని పోవుచున్న విషయము
రామలక్ష్మణులకు నీవు వివరించుము.
====================================
అరణ్యకాండమందు 49వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి