50వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి


ఖరుడు శూర్పణఖ వలన రామునితో తలపడెను 
ఆ రఘురాముడు అతడిని హతమార్చెను. 
ఇందులో శ్రీరాముని దోషమేముంది?
సీతాదేవిని అపహరించుట ఎంతవరకు సముచితము' 

ఓ రావణా! వెంటనే సీతాదేవిని విడచిపెట్టు
మోయగలిగిన బరువే మోయాలి 
జీర్ణమగు ఆహారమునే తినవలెను 
కీర్తికి భంగము కలిగించు పనులు చేయరాదు 

ఓ రావణా క్షణమాగుము వీరుడవైనచో 
నాతో యుద్ధము చేయుము 
ఆ రఘువరడు నిన్ను త్వరలో వధించును 
ఓ నీచుడా! ఒంటరిగున్న స్త్రీని అపహరించితివి. 

వారిని తీసుకొని వచ్చుటకై నేను వెళ్ళినచో 
నీవు ఇచ్చేటి నుండి పారిపోదువేమో 
అందుకని నేను నిన్ను చంపెదను 
నా బొందిలో ప్రాణము ఉండగా ఈమెను తీసుకపోలేవు. 

ఓ దశగ్రీవా! ఒక్క క్షణకాలము పాటాగుము 
ఓ నిశాచరా! రణభూమి యందు నీకు తగిన 
సత్కారమును జరిపిదెను చూడుము
నిన్ను రథము నుండి క్రింద పడవేసి చంపెదను. 

====================================

అరణ్యకాండమందు 50వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు