సీతాదేవిని తన రథముపై తీసుకొని పోవుచున్న రావణుని నిలువరించుచు
జటాయువు హితోక్తులు పలుకుట.
సీతాదేవి ఆక్రందనలు వినగానే
అతడు తొందరగా మేల్కొని
రథముపైనున్న రావణుని, వైదేహిని చూచెను
జటాయువు రావణునితో ఇలా పలికేను
''ఓ దశగ్రీవా! నా పేరు జటాయువు
భగవంతుని నమ్మినవాడను
శ్రీరాముని యొక్క సేవకుడను
ఓ రావణా ధర్మాత్ముడైన ఏ రాజైన
పరసతులను ఎట్లు స్ప్రుశింతురు
నీచమైన నీ ఆలోచనను మానుకో
నీవు అకార్యమునకు పాలుపడుట తగదు
ఓ రాక్షస రాజా! నీవు పాప శీలుడవు
నీకీ రాజ్యాధికారమెట్లు వచ్చినది
పుణ్యాత్మునకు ప్రాప్తించవలసిన
స్వర్గవిమానము నీకెట్లు వచ్చినది
దష్టాత్ముల మనస్సునలోుఈఉీీ
సదుపదేశములు ఎక్కువ కాలములు నిలువవు
శ్రీరాముడు నీకేమైనా హాని తల పెట్టాడా
ఆయన భార్యనెందుకదుకని అపహరించావు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి