51వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి


వృధ్ధావస్థ కారణముగా జటాయువు 
మిక్కిలిగా అలిసిపోయి యుండుట చూచి 
రావణుడు ఎంతయో సంతోషించుచు 
సీతాదేవిని తీసుకొని ఆకాశమునకు ఎగిరెను. 

ఆకాశమున సాగిపోవుచున్న 
రావణుని జూచి జటాయు పైకెగిరేను
ఆ తేజస్విని అతనికి ఎదురుగా నిలిచి 
నిరోధించుచూ ఇట్లు పలికెను. 

ఓ అల్పబుద్ధిగల రావణా! నా మాట వినుము 
శ్రీరాముని బాణములు వజ్రతుల్యములు 
ఆ మహావీరుని భార్య అయిన సీతాదేవిని 
నీవు గోనుపోవుట నీ చావుకొరకె రావణా!

ఎరకు ఆశపడి గాలానికి చిక్కిన చేపవలె 
నీవు మృత్యువును తప్పించుకొనజాలవు 
సీతాదేవిని అపహరించి రామలక్ష్మణులకు 
తీరని అవమానమును గూర్చితివి. 

వారు నిన్ను ప్రాణములతో విడిచిపెట్టరు 
ఓ రావణా! నీవుచేసే ఈ పని దొంగలు చేసెదరు 
ఓ దశగ్రీవా! క్షణకాలము నిలువుము 
నీవు వీరుడవైనచో నాతో యుద్ధము చేయుము.

కామెంట్‌లు