సీతాదేవికి ఎట్టి ప్రమాదము సంభవించినదో? అని శ్రీరాముడు కలవరపడుట
లక్ష్మణుని జూచి శ్రీరాముడు ఇట్లు అడిగెను
లక్ష్మణా! నేను సీతా దేవిని నీకు ఒప్పగించి వచ్చాను
ఆమెను ఒంటరిగా వదిలి ఎలా వచ్చావు?
ఓ వీరుడా! ఆమె లేకుండా నేను జీవింపజాలను
ఆ సీతదేవీ! నాకు ప్రాణతుల్యురాలు
లక్ష్మణా! వైదేహి జీవించియుండునా?
నా వనవాస జీవితము వృధా కాదు గదా?
అయ్యో! లక్ష్మణా! అన్న అరుపును వినగానె
నీవు భయపడి పరుగులు తీస్తూ ఇటువస్తివా !
నా కంఠస్వరధ్వనిని విని జానకి నిన్ను పంపెనని
అందువలన నీవిటు వచ్చినట్లు తలంచుచుంటిని
వారిరువురు చాలా దూరము నడచివచ్చిరి
ఆర్తితో యున్న లక్ష్మణుని మందలించుచు
శ్రీరాముడు ఆశ్రమము వద్దకు చేరగానే
పక్షులు భయంకరంగా అరుచుచున్నవి.
అచట సీతదేవి కనబడకపోవుటచే
ఆశ్రమము చుట్టుపక్కల వెతుకుచుండిరి
ఆమెతో విహరించిన ప్రదేశములను చూచిరి
సీత కనబడక రాముడు చింతాక్రాంతుడయ్యెను.
=========================================
అరణ్యకాండమందు 58వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి