60వ సర్గ : ( 3 ): - ఎడ్ల లక్ష్మి


కమలముల వంటి కనులు గల దానా!
నన్ను చూచి నీవెందుకు పరిగిడుచున్నావు 
నేను నిన్ను ఇక్కడనే  చూచితి సుమా! 
నీవు చెట్ల చాటుకు దాగి ఉండుటేల? 

ఓ శుభాంగీ! నీవు పరిగెత్తుచున్నను 
నీవు ధరించిన పితాంబరమునుబట్టి
నేను నిన్ను గుర్తించితిని 
నాపై దయ ఉన్నచో ఇక నిలువుము. 

అయ్యో! నేను ఇంతవరకు భ్రమకు లోనైతిని 
ఒంటరిగా ఉన్న నా సీతను ఏ రాక్షసుడు భక్షించెనో
ఆమె భూమిపై బ్రతికి ఉన్నట్లయితే 
నేను ఇంత కష్టపడగా చూడలేదు. 

సీతాదేవి ఒంటరిగా ఉండుట చూచి 
మాంసబక్షకులైన రాక్షసులు ఆమెను  
ముక్కలు ముక్కలుగా చేసి భుజించిరేమో! 
శ్రీరాముడిలా! పరితపించుచుండెను.

ఆమె ముఖము చక్కని పలువరసతో 
దర్శనీయమైన పెదవులతో అందమైన ముక్కుతో 
సుందరమైన రూపుతో విరాజిల్లుచుండెను 
ఆమె ఇప్పుడు ఎట్టి బాధలోయుండెనో?

కామెంట్‌లు