శ్రీరాముడు ఆగ్రహమునకు లోనై వ్యథచెందుచుండగా సౌమిత్రి ఓదార్చుట
ఆశ్రమమున చూచి దుఖించుచుండెను
ఓ సౌమిత్రీ! సీత ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు
ఆమెను ఎవరైనా చంపితినియుందురా?
ఓ సుందరీ! సీతా! నీవు లేక ఎట్లుండగలను
నిన్ను వనములోకి తెచ్చి ఆగము చేసితిని
నేను మీ తండ్రి జనకునికి ఏమని చెప్పాలి
మా తల్లి కౌసల్యకు ఎట్లు తెలుపాలి
శ్రీరాముని జూచి లక్ష్మణుడు ఇట్లు అనెను
ఓ అగ్రజా! నీవు దుఃఖింపకుము
మనిద్దరం కలిసి సీతాదేవిని వెదకుదాము
ఓ అన్నా! ఈ అడవిలోని గుహలన్నిటిని
అన్వేషించుదాము
లక్ష్మణుడు ఇట్లు ప్రేమతో ఓదార్చగా
శ్రీరాముడు మనసును దిటవు చేసుకొని
లక్ష్మణునితో గూడి సీతను వెదకసాగెను
ఎంత వెతికినా ఆమెజాడ తెలియదు.
శ్రీరాముడు పదేపదే నిట్టూర్చుచూ
అతడు బిగ్గరగా సీతను పిలుచుచుండెను
రాముని జూచి సౌమిత్రి ఓదార్చుచుండెను
రాముడు సీతా! సీతా! అని గట్టిగా పిలువ సాగెను.
=============================================
అరణ్యకాండమందు 61వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి