రామలక్ష్మణులు దక్షిణ దిశగా వెళ్ళుట, సీతాదేవి ధరించిన పూలను అభరణములను
ఆమె పాదచిహ్నములను గుర్తించుట.
అప్పుడు ఆ మృగములు దక్షిణం దిక్కు తిరిగి
గట్టిగా అరువగా లక్ష్మణుడు గమనించి
అన్నా అవి దక్షిణ దిశను చూపుచున్నాయి.
అగ్రజా! వెంటనే మనము అటువెళ్ళుదాము
అటు వెళ్లినచో సీతాదేవి కనబడవచ్చు
సరే అని రాముడు ఆమోదము తెలిపెను
వారిరువురు దక్షిణ దిశగా బయలుదేరినారు.
రామలక్ష్మణులు ముచ్చటిస్తూ వెళ్తుండగా
దారిలో సీతాదేవి ధరించిన పూలను జూచిరి
రాముడు భూమిపై బడిన పుష్పములను జూచి
దుఃఖిస్తూ లక్ష్మణునితో ఇట్లు పలికెను
"ఓ సౌమిత్రీ! ఈ పుష్పములను గుర్తించితిని
ఇవి సీతాదేవివే తన కురులపై ధరించినవే
నేను చూచుటకై సూర్యుడు వీటిని వాడనియ్యలేదు
భూదేవి వీటిని తన ఒడిలో రక్షించుచున్నది
నది ఒడ్డున నడుస్తూ శ్రీరాముడు వెళ్ళుచుండగా
రాక్షసుని యొక్క పెద్ద పెద్ద పాదముల గుర్తులను చూచెను
అచ్చటనే సీతాదేవి పాదముద్రలు గూడా కనపడెను
శ్రీరాముడు ఆ గుర్తులు చూస్తూ వెళ్లుచుండెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి