అతని రథమును ధ్వంసము చేసితిని
అతని సారథిని ముక్కుతో పొడిచి చంపితిని
ఇక్కడ పడి యున్న శవము ఆ సారథిదే
యుద్ధము చేసి మిక్కిలిగా అలిసియున్న నన్ను చూచి
ఆ రావణుడు నా రెక్కలను ఖండించి
నేను నేలపై పడగానే సీతను తీసుకొని వెళ్లెను
సీత గూర్చి జటాయువు పూర్తిగా వివరించెను.
సీతాదేవి అపహరణ గూర్చి వినినంతనే
రామలక్ష్మణులు మిక్కిలిగా దుఃఖించిరి
సీతను రక్షించుటకై ప్రాణాలను అడ్డుపెట్టిన
జటాయువను శ్రీరాముడు కౌగిలించుకొని దుఃఖించెను
జటాయువును చూచి లక్ష్మణుడు శోకించెను
ఓ లక్ష్మణా! సీతాదేవి ఎడబాటుతో
నన్ను అంతులేని దుఃఖము వెంటాడుచున్నది
నా అంత భాగ్యహీనుడు ఎవ్వడు లేడు కదా!
సీతకై ఈ జటాయువు గాయపడి యున్నది.
నా దురాదృష్టంవలన ఈ జటాయువు
నేలపై పడియున్నది అని దుఃఖిస్తూ
శ్రీరాముడు కూడా నేలపై పడిపోయెను.
అరణ్యకాండమందు 67వ సర్గ సమాప్తము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి