కబంధుడు శ్రీరామునకు తన పూర్వ వృత్తాంతమును దెలుపుట-
శ్రీరాముడు అతనితో సీత వృత్తాంతము వివరించుట
పూర్వము చాలా అందముగా యుంటిని
నేను కామరూపుడ నగుటచే
వికృతరూపంతో మునులను భయపెట్టే వాడను.
స్థూలశిరుడు అనే పేరు గల ఒక మహర్షి
నీకు ఈ క్రూర రూపమే శాశ్వతమగును అని
నన్ను ఘోరముగా శాపించెను
అతనిని వేడుకొని శాప విముక్తికై అడిగితిని
అప్పుడు ఆ మహర్షి ఇలా పలికెను
రామలక్ష్మణులు ఈ వనమునకు వచ్చి
నీ భుజములను ఖండించెదరు
అప్పుడు నీ రూపము నీకు వచ్చునని తెలిపెను
ఈ కబంధ రూపము ఎలా వచ్చిందో తెలిపెదను
నేను ధనువు యొక్క కుమారుడను
ఒక యుద్ధమున ఇంద్రుడు కుపితుడై
నాకు ఈ రూపము కలుగునట్లు చేసెను
ఓ దేవేంద్రా! నీవు నా తొడలను ముఖమును
ఖండించితివి నేనెట్లు జీవించాలని ప్రార్థించగా
పొడవైనచేతులను వడైనకోరలతో ముఖమును
నా పొట్టకు కల్పించెను ఇదే నా రూపచరిత్ర.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి