అందరం ఒక్కటే, ఓ పర్వదినం!మనం దగ్గరయ్యే, శుభ దినం!ఐకమత్యమే, గుణవర్ధనీయత!అనైక్యతే, మానవ బలహీనత!కలసి ఉంటే కలదు సుఖం,అన్నదే మెదడుకు మేత!లోహపురుష్,సర్దార్ వల్లభాయి పటేల్,పుట్టినరోజు దివ్య సంస్మరణం!ఖబడ్దార్ అని సంస్థానాల,విలీన భవ్య నాయకత్వం!విక్రమ పురుషుడు,నేడు విగ్రహ పురుషుడు!నర్మదా తీరం గుజరాత్ రాష్ట్రం!కేనడియా దీవి, మెరిసే తేజం!ఆ విగ్రహం జాతి సందర్శనం!భారతాన సద్భావ ప్రజ్వలనం!నవంబరు నెల ఒకటి నుండి,పదిహేను భారత్ పర్వ్!దేశమంతా సర్వజన,మహోత్సవం !విభిన్నత్వంలో ,ఏకత్వ ప్రదర్శనం!దేశమంతా ఏకతాసూత్ర నిదర్శనం!వందేమాతరం ,భారతీయుల అంతర్దర్శనం!పక్షులు ఒకటై ,ఎగురుతాయి !చుక్కలు ఒకే,ఆకాశాన మెరుస్తాయి!రంగులు హరివిల్లై,అందంగా కలిసి ఉంటాయి !నదులన్నీ సముద్రాన,ఏకమవుతాయి!చీమలొకటై బారుగా,తీరుగా నడుస్తాయి!మనిషి ఒంటి పిల్లి రాకాసొ?వెలుగునిచ్చే పున్నమి జాబిల్లి!మనిషి పరమార్ధంగా బతకాలి!ఉన్నా, పోయినా ,చేతల్తో,బతికి ఉన్నాడని పించాలి!మంచి పెంచి, పంచి ,జీవితాన తరించాలి!________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి