నేను ఎదిగినా ఏడ్చేజనం చుట్టూతున్నారు
నేను నవ్వినా
నన్ను పిచ్చోడన్న నయవంచకులున్నారు
నేను పతనమైతే పండగచేసుకునేవారు
ముందు ముఖస్తుతి చేయువారే
నావెనకాల గోతులు తొవ్వుతున్నారు
నన్ను పరిహాసం చేస్తూ
పకపకనవ్వే
పరమబేవకూబ్ నాయాళ్ళు
నా చుట్టూతే ఉన్నారు
నేను అన్యాయాన్ని సహించను
అది నాచేతగానితనం అంటూ
నన్ను ఎగతాళి చేసే మేటి స్వార్థులే నాచుట్టూతున్నారు
గొడవలు, గోలలు, అవహేళనలు
నిందలు
సమయం చూసి దెబ్బతీసే
కుట్రదారులు
అడుగడుగునా కాచుకొని ఉన్నారు
పరాన్న జీవనం
పైశాచికత్వం
దుష్టజనసాంగత్వం
నిత్య కృత్యంగా బ్రతికేవారు
ఊరూరా గల్లీ గల్లీకి ఉన్నారీ గలీజ్ గాళ్ళు
నేను రాక్షససహనంతో
కాలమెల్లదీస్తున్నాను
బురదలో రాయేయకూడదని
చెడిన సమాజాన్ని మార్చలేక మధనపడుతూ ముందుకెళ్తున్నా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి