సామెత-383: ఈ ఊల్లో పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళు అన్నట్టు
***
"గదేందవ్వా! శెప్పుకుంటే నవ్వాల్నా తిట్టాల్నా తెల్వదు.బలే గమ్మతిగ వుంటది. శిత్రమైన మడుసులు.శిత్రమైన పోబడి. నాకైతే ఎంత యిచ్చింత్రంగ అన్పిచ్చిందో. "నేన్రాన్రా వారీ అంటే ఎహె రారాబై. ఎప్పుడు గుడ్ల మీద కోడి లెక్క ఏడికి కదలవు వత్తవా రావాని తోల్క పోయిండు.''
"ఏందిరా అయ్యా? నువ్వన్నదేందో సమజవ్వలే. అసల్కి తల్కాయల కెక్కలే? ఎవలి ముచ్చెటి శెప్తున్నవో ఏం కతనో ఎరికనే కాకపాయె.జెర ముందుగాల గాళ్ళు ఎవలో ఏందో శెప్పరా అయ్యా!"
"గదేనవ్వా! నిన్న నా దోత్తుగాడు సత్నారి గాడొచ్చి నన్ను తోల్కపోయిండు సూడు "
"గదేరా ఎందుకు తోల్కపోయిండో సత్నారి శెప్పలే. నూ సుత శెప్పకపోతివి?"
" గదేనవ్వా! గానికి గా వూల్లె ఓ సంవందం వొచ్చిందంట. పిల్లని సూడ రమ్మన్నరంట.కూసింత దైర్నంగుంటదని నన్ను సుత ఎంట తోల్క బొయ్యిండు ."
"ఏందిరా అయ్యా! గాని అమ్మనాయినోళ్ళు లేకుండ మీరే వొయ్యిర్రా ఏంది? పెండ్లి సూపులకి పెద్దోళ్ళు లేకుండ బోవుడేందిరా? కలికాలం గాక పోతే..."
"ఎహే! ఆగే అవ్వా! గాళ్ళు సుత ఎంట వున్నరు. అస్లిష్యం శెప్పనియ్!"
"నేనో బండి మీద సత్నారి గాన్ని, గాని మేనమావఁ బండి మీద గాని అమ్మనీ, సత్నారి నాన్నని కూసవెట్టుకొని వొయినం."
"ఇంగ ఊల్లెకి ఎల్లే తొవ్వల తాళ్ళు,ఈతలు శానా ఉన్నయి.గా డొంకల ఊరి తొవ్వ తెల్వక తిప్పతీగ తొక్కినట్టు ఆడాడనే తిర్గబట్టినం. శివరాకర్కి ఓ పెద్దాయిన అగవడ్తే అమ్మయ్య అన్కొని పొయ్యి గా వూల్లె గీని సంవందం ముచ్చెటి శెప్పినం."
"గాయిన మమ్మల్నో పాలి ఎగాదిగ సూశిండు. ఆటెంక జెరాగుర్రి నా గాడ్దిని తెచ్చుకోవాలె అన్కుంట వొయ్యి ఉతికిన గుడ్డల మూట దాని మీద ఏస్కొనొచ్చి మీరు గిట్ల తాళ్ళ తొవ్వెంట నడ్సుకుంట ముక్కు సూటిగ వోండ్రి. గట్ల వోతె ఊరొత్తది. గాళ్ళ ఇల్లు సుత ఎదురొత్తది అన్కుంట గాడ్దిని ఎక్కి వొయ్యిండు."
"గిదేం తొవ్వ సూపుడ్రా అయ్యా? పలానా బడి తాన్నో బాయి తాన్నో,బొడ్రాయి తాన్నో అని ఏదో ఎరిక సూపి శెప్పొచ్చుగద?
"గదేనవ్వా! శిత్రం. గా తాళ్ళ తొవ్వ పొంటి వోతుంటే వొక్కడు సుత సరింగ శెప్పలే.గా తాళ్ళని నమ్ముకుని శివర్దనుక ఎల్లినం. గాన్నో యిల్లు అగవడంగనే పానాలు లేశొచ్చినయ్."
"గింతకీ గీ సంవందం ముచ్చెటి శెప్పినోడు ఎందుకు రాలేదురా అయ్యా! గాని శానతనం కాకపోతే. గాయినొత్తే గిసుమంటి యిస్మ సంది వొచ్చేది గాదుగా?"
'అవునవ్వా!గీ నిర్వాకమంత పెండ్లిల్ల పేరయ్య శేసిందే. ఏం జేత్తం.వొయినం కూసున్నం.పిల్ల నాయినకి మేం రేపొత్తమని శెప్పిర్రట. మమ్మల్ని ఎడ్డె మొగం ఏస్కొని సూడవట్టిండు."
"గింతకి పిల్లని సూపిచ్చిర్రా?"
"గా పెండ్లివిల్ల పక్కూరి పంచన్కి ఎల్లిందంట అమ్మతోని. పిలిపిత్త మాపటేలకి వొత్తది కూసోండ్రి అంటుంటే తెల్ల మొగాలేస్కొని 'బానే వుంది సంబుడం' మన్సుల తిట్టుకుంట ఎల్దమని లేశినం.గంతల్లనే మొదగాల అగవడ్డ పెద్దాయన,ఇంకిద్దర్ని ఎంట బెట్కొని వొచ్చి తలింత గిలాసలల్ల సల్ల వోసి ఎండల వడి వొచ్చిర్రు.తాగుర్రి అని యిచ్చిండు. పైంగ గీ వూల్లె తాళ్ళు పెద్దమడుసుల్లెక్క వుంటయి.దారి సూప్తయి" అన్నడు."
"గా మాటకి ఏవనాల్నో తెల్వలే.తాళ్ళు పెద్ద మన్సులేంది అన్కున్నం.ముందుగాల బయమేసిందవ్వా? గది సల్లనా? సారనా! సారనైతే గది తాపిచ్చి వొంటిమీదున్న ఉంగరం, గొల్సులు దొబ్బుక పోరుగద అని"
"గయేం మాటల్రా? అనుమానపోడా? పిండ్లి విల్ల అయ్య మరియాద శెయ్యకున్నా పాపమని గా పెద్దాయన,ఇంకో గాయన్ని పట్కొచ్చి మరీ శేత్తే గట్లనవడ్తివి?"
" తిర్గి తిర్గి గదంత సూశినం గద.పతొక్కటి గట్ల అనుమానంగ అన్పిచ్చింది అవ్వా.పాపం సత్నారి మొకం సూడాలె.శివాంట పెండ్లి సూపులు గిట్లయినయని ఒకటే రంది వడుడు."
నువ్వు శెప్తుంటే నాకు సుత గమ్మతి గనిపిచ్చిందిరా అయ్యా!" ఈ వూల్లె తాళ్ళు పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే సాకళ్ళు" అన్నట్టుంది గద "
"అవునవ్వోవ్! బలే శాత్రం జెప్పినవ్? నిజ్జంగా నిజం అవ్వా! నూ శెప్పింది సుబూదిగ నిజవేఁ అవ్వా!'
"గదండీ సంగతి! ఈ ఊల్లె పెద్దలు ఎవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళు "...గిట్ల కొన్ని గమ్మత్తైన శాత్రాలు ఉంటయి.గసుమంటియి రాడానికి గసుమంటి గమ్మతి మడుసులే మరి.మీకు సుత గీ శాత్రం ముచ్చిటి నచ్చే వుంటది గదురుల్లా!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి