" ప్రకృతి ఆక్రుతిని...వి క్రుతం చెయ్యొద్దు...! ": - కోరాడనరసింహా రావు.


ప్రకృతి సహజ సుందరం 
   నిర్మలం...నిష్కల్మ ష0
ఎత్తైన గిరులు... 
 పచ్చని భూజములు... 
 దట్ట మైన అడవులు...! 
   గల గల పారే ఏర్లు... జీవ నదులు...! 
 నెలకు మూడువానలు పుష్కల పాడి పంటలు ! 
 శుద్ద మైన నీరు... స్వచ్ఛమైన గాలి...!! 

మనిషి ఆనందంగా బ్రతకటానికి ప్రకృతి అన్నీ సమ కూ రిస్తే.... 

మనిషి అత్యాశ... 
అతి సుఖాల వెంట పరుగులు తీసి... 

కొండలు కరిగిపోయాయ్
 అడవులు అంతరించి పోయాయ్

నదులు... ఏర్లు కాలుష్య కూపాలు... 
  అకాల వర్షములు... 
 అతివృష్టి , అనావృష్ఠి
 నీరు, గాలితో పాటు
 పళ్లు, పాలు... 
  పదార్ధాలన్ని కల్తీ....! 

ఎలక్ట్రానిక్ , ఎలక్ట్రిక్ 
 మోటారు... 
 వినిమయ వస్తువులతో
 గ్లోబల్ వార్మింగ్...! 
 భరించ లేని తాపం...!! 

మనిషి ఈ ప్రకృతి ఆక్రు తిని, ఎంత విక్రుతంగా మార్చేసాడు...! 

అతి సుఖాలకు ఆశ పడి
కోరి ఎన్నెన్ని కష్టాలను కొని తెచ్చు కున్నాడు..!! 

తమ వారసు లైన భావి తరాలకు ఆస్తులతో పాటు... 

ఇన్నిన్ని బాధలను, భయాలను అందిస్తే... 
 వారి బ్రతుకు నరకమై పోదా...!? 

మన వారసులకు మన మివ్వాలసిన గొప్ప ఆస్తి
 స్వచ్చమైన నీరు, గాలి
కాలుష్య రహితమైన జీవనం

ఇందు కోసం మన మిప్పుడే త్వర పడక పొతే... 
 ఎప్పుడో వారు కాదు... 
 ఇప్పుడు మన జీవితాలూ నరక ప్రాయాలే....! 

విరివిగా మొక్కలు నాటుదా0
 అతి సుఖాలను తగ్గించేద్దా0
 కల్తీలు కాలుష్యాలను నివారి ద్దా0
  ప్రకృతికి తన సహజ నిర్మల సౌంద ర్యాన్ని తిరిగి తనకిచ్చే ద్దా0
    ప్రాణి కోటి మనుగడను సుఖము, ఆనందమయం చే ద్దా0...!! 
      ******
కామెంట్‌లు