ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్లీ యునైటెడ్ టీచర్స్ (ఒ. జి. యు. టి) సాహిత్య కళా వేదిక జాతీయ గౌరవ అధ్యక్షునిగా విశాఖ పట్నం ( ప్రస్తుతం అమెరికా) లో ఉన్న కవి ,రచయిత సాహిత్య రత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశ్రాంత రసాయనశాస్త్ర శాఖాధిపతిని నియమిస్తు సంస్థ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒ. జి. యు. టి అధ్యక్షుడు నక్కిన వీర రాఘవ రావు, మహిళా అధ్యక్షురాలు పి.వి. ఎం నాగజ్యితి, కార్యదర్శి కి. శంకర రావు, మహిళా ఆర్గనైజేషన్ కార్యదర్శి గంగా భవాని అభినందనలు తెలియచేస్తు ఉపాధ్యాయులు, కవులు,రచయితలను సమన్వయ పరచి సమాజాభివృద్ధికి యువత కు ప్రేరణ సాహిత్యం ద్వారా అందచేయాలని సంస్థ ఉద్దేశ్యం అని అనుభవం గల అధ్యాపకునిగా ప్రసాద్ మాస్టారుని గౌరవ అధ్యక్షునిగా తీసుకున్నామని తెలియచేసారు. వాల్మీకి , కుసుమ ధర్మన్న, కాప్రా, విశాఖ సాహితీ, శ్రీశ్రీ అంతర్జాతీయ సాహితీ సంస్థ, వీక్షణం కాలిఫోర్నియా సాహితీ సంస్థ,సహృదయ సాహితీ గో సంరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ ముప్పది ఆరు సంవత్సరాల పాటు ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దిన నాపై డెబ్బది సంవత్సరాలు దాటిన వయస్సులో జాతీయ స్థాయి గౌరవ అధ్యక్షునిగా నియమించడం సరస్వతీ మాతకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని నిర్వాహక వర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు.
.................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి