సాక్ష్యం: - కొత్త విరిత


“నేను ఎక్కువసార్లు చూశాను…”
“నువ్వు కాదు… నేనే ఎక్కువసార్లు చూశాను!”
“అదేం కాదు… నువ్వూ కాదు… నేను చూశాను చాలా సార్లు!”

ఇలా వంటగదిలోని గిన్నెలు, గాజు సీసాలు, స్టీల్ సామాన్లు ఒకదానితో ఒకటి గొడవపడుతున్నాయి.
ఇంతకీ అవి ఏం చూశాయో తెలుసా?
ఇంట్లో అందరికీ భోజనం పెట్టే చేతులు…
అందరూ వెళ్లిపోయిన తర్వాత, అదే వంటగదిలో నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకున్న క్షణాలను చూశాయి.
ఆమె నవ్వుతూ వంట చేసింది…
ఆమె ఏడుస్తూ కూడా వంట చేసింది…
ఎవరూ అడగని బాధను, ఎవరూ చూడని కన్నీటిని వంటింటి గోడలే ప్రతిరోజూ విన్నాయి.
ఒక్కోసారి పొయ్యి మీద మరిగేది పాలు కాదు…
ఆమె గుండెల్లో దాచుకున్న బాధ కూడా.
గిన్నెలు చప్పుళ్లు చేస్తూ ఉంటే,ఆ శబ్దం వెనుక ఒక ఇల్లాలి మౌనం ఎవరికీ వినిపించదు.
ఇంట్లో ఎవరికీ కనిపించని కన్నీళ్లకు,వంటగదిలోని సామాన్లే ఎన్నిసార్లో సాక్ష్యాలయ్యాయి.

మరి,ఇల్లు అందరికీ కనిపిస్తుంది…కానీ ఆ ఇంట్లో ఎవరు ఎక్కడ ఏడ్చారో,
వంటగదికే ఎక్కువగా తెలుస్తుంది కదా!

కామెంట్‌లు