నీకు రహస్యం తెలుసుకోవాలని ఉందా?:- అనుసృజన - యామిజాల జగదీశ్


 ఒకసారి తన గొప్పతనం తనకే ఎక్కువనుకునే ఒకాయన వచ్చి, “నాకు ఒక రహస్యం చెప్పండి” అన్నాడు.
నేను ఇలా అన్నాను.
“నేను నీకు రహస్యం చెప్పలేను. నా రహస్యాన్ని ఎవరికైనా చెప్పాలంటే, ఆ మనిషిలో నాకు అతను కనిపించ కూడదు. నన్నే నేను చూసుకోవాలి. అప్పుడు నా రహస్యాన్ని నాకు నేనే చెప్పుకున్నట్టవుతుంది.
కానీ నీలో నాకు నేను కనిపించడం లేదు. ఇంకెవరో కనిపిస్తున్నారు.
ఒక మనిషి మరో మనిషి దగ్గరకు రావడానికి మూడు కారణాలుంటా యి.....
ఒకటి, అతను శిష్యుడిగా వస్తాడు. రెండోది, స్నేహంతో వస్తాడు. 
మూడోది, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి వస్తాడు.
నువ్వు ఈ మూడింటిలో ఏ రకం? నువ్వు ఫలానా వ్యక్తి దగ్గర కూర్చుంటావు కదా?”
“నేను ఎలాంటి వాడినో నీకు అర్థమైందా?” అని అతను అడిగాడు.
“అర్థమైంది. నీలో నాకు అతనే కనిపిస్తున్నాడు. అతను నీలో ఉన్నప్పుడు, నువ్వు నాలో లేవు. ఎందుకంటే అతను నేను కాదు.”
======================================
- రూమీస్ సన్ పుస్తకంలో నుంచి
కామెంట్‌లు