కృతజ్ఞత! అచ్యుతునిరాజ్యశ్రీ
 

ఒకరు మనకు ఏదైనా ఉపకారం చేస్తే థాంక్స్ అంటాం.అది కనీస మర్యాద. అలా అని వారు ఏమీ చెప్పకపోతే,వారిపై కోపం ద్వేషం పెంచుకోటం తగదు.కోపం విషంకన్నా ప్రమాదం.ఓవ్యాపారి తన పనివారికి జీతంతో పాటు బోనస్ ఇస్తే ఒక్కరుకూడా కృతజ్ఞతలు తెల్పలేదని కోపం కసితో  మింగాలేక కక్కాలేక లోలోపల కుళ్లి అనారోగ్యంపాలైనాడు.జీతం తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఈబోనస్ కంటితుడుపుచర్యగా భావించారేమో? ధైర్యం లేక చెప్పలేక పోవచ్చు.శామ్యూల్ లైబోవిజ్ ఓన్యాయవాదిగా 78మందికి ఉరిశిక్ష తప్పించాడు. ఒక్కరు కూడా క్రిస్మస్ కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ పంపలేదు.అందుకే మనకు చేతనైన సాయంచేసి ఎలాంటి కృతజ్ఞత ప్రతిఫలం ఆశించరాదు. స్వాతంత్య్రోద్యమనేతలు స్వార్ధం తో కృతజ్ఞతలు ఆశించి పోరాటం చేయలేదు.మనధర్మం కర్తవ్యం మనం నెరవేరిస్తే చాలు.నేడు అంతా ఉల్టాపుల్టా జీవితాలు.మీఇంటికొస్తే మాకేమిస్తావు,మాఇంటికొస్తే ఏంతెస్తావు అనే స్వార్థం పెరిగింది.దైవం ప్రకృతి తరులకు మనం  ధన్యవాదాలు చెప్పటంలేదుగదా? మనకు ప్రవచనకర్తలు ఎన్నో మంచివిషయాలు రోజూ చెప్తున్నారు.ఐనా మనం కృతజ్ఞతలు తెలపాలని వారు ఆశించరు. ఇదే అసలుసిసలు సేవాభావం🌹
కామెంట్‌లు