సామెత-391: ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది
**
"అబ్బో! ఏవోఁ అన్కున్న గని గా పుట్టయ్య మావ మా యికమతుల పిట్టని గీ నడ్మల్నే తెల్శిందవ్వా! "
"అవునా శెల్లె! గట్లెట్ల మాగనే కన్పెట్టినవ్! ఏం జేశిండేంది? బెల్లపరిశెల్లెక్క తియ్య తియ్యగ మాట్లాడ్తడు గద గది జూసి అంటున్నవా? లేకుంటే శారాణ యిచ్చి బారాణా పని శేయించుకుంటడు గద గా శెకలు సూశుంటన్నవా?
"గయ్యన్ని నాకు తెల్వదు గని అవ్వా! పంచాతులు షెడాయితుల యవ్వారాల్లో మా వుషార్గ ఉంటున్నడు. వొకీల్ సాబ్ లెక్క గాల్లను కూసబెట్టి తీర్మానం శేత్తుండు."
"గంత మంచి బుద్ధి యాన్నించి వొచ్చింది మన పుట్టయ్య మావఁకి. మాగనే సమాజ సేవ జేత్తుండట్టుంది. మొన్న సద్దుల బత్కమ్మ కానించి సూత్తున్న మాట తీరు యవ్వారం పురాగ శానా శానా మారిందవ్వా!"
"అవును శెల్లే! నాకు సుత గట్లనే అన్పిచ్చింది. బాగ బత్కనేర్శినోడు.పొల్లగాండ్ల సద్వులు అంతంత మాత్తరమే. గాల్లకి సర్కారు నౌకర్లు వొచ్చేతట్టు శేసిండు.ఏం మశిబూసి మారేడు గాయ శేసిండో..!"
"ఊల్లె శిన్నా పెద్ద..పతొక్కలి నోట్లె గా పుట్టయ్య మావఁ ముచ్చెటినే శెల్లే! గీ నడ్మల ఎలెచ్చన్లు వొచ్చినయ్ గద! పెద్ద మనిషి వొర్తిత్వం వొయించి ఓ పారిటీ వోళ్ళని గెల్పిచ్చిండు."
గదేనవ్వా! గట్ల జేయిచ్చుడు సంగతి అందరికి తెల్సుగని. దానెనెక కతేందో జెర శెప్పరాదు."
"గదేనవ్వా! మన పుట్టయ్య మావఁ ఆకులను పట్టుకొనుడు గాదు.గా కాండం,గా ఏరు పట్టుకోని ఎగబాకే రకం. శిన్నగ ఏం పావులు కదిలిచ్చిండో గని అడివిల పంచాతిల ఉన్న బూవీ పట్ట తన పేర్న రాయిచ్చుకుండు."
"అవును శెల్లే! గందుకే మన పెద్దోళ్ళు ."ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది" అని ఊకెనే అన్లే. మాటల్తో బురిడి కొట్టిచ్చి,కుక్కకి బొక్కేసినట్టు గాళ్ళకి రాశ మర్యాదలు చేశి తన పన్లు నెగ్గిచ్చుకుండని తెల్శింది."
"అయిన గని శెల్లే! మంచైనా శెబరైన జెర ఒకలు షురూ శేత్తే మిగతోళ్ళు షురూ శేత్తరు. గా కిటుకు తెల్శినోడు మన పుట్టయ్య మావ."
మన శేతుల్ల, కాళ్ళల్ల కీల్లు ఎట్ల మళ్ళుతయో తెల్సు గద. ఒకటి మళ్ళితే ఇంకోటి మల్లి మనం అనుకున్నది శెయ్య లేత్తం.గట్లనే పని నెగ్గిచ్చుకోవాలంటే గిట్నించి గింత కదిలిత్తేనో మళ్ళిత్తేనో గట్నించి కదలిక వొత్తదన్న మాట."
"అవుమల్ల! మాగ జెప్పినవ్ అవ్వా! ఆపీసులల్ల పన్లు గీ కలి కాలంల ఎవలు నియతుగ శేత్తుర్రని. బల్ల కిందనో,పైన్నో శేతులు తడిపితేనే కదలికొచ్చి పన్లు అయితున్నయి. గిసుమంటి యిష్యాలకు సుత గీ శాత్రాన్ని పోల్శి శెప్పొచ్చు గదవ్వా!"
"అవును శెల్లే!"
"గదండీ సంగతి! "ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది" అంటే గిదే మరి.గీ శాత్రాన్ని ఎటీలైతే అటు శెప్పుకోవచ్చు."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి