పోగొట్టుకున్న ఒక తమిళ పుస్తకం చివరి క్షణాలు…; - - అనుసృజన - యామిజాల జగదీశ్.

 

 ఎన్నో ఏళ్లుగా గ్రంథాలయంలో ఎదురుచూశాను… మీ కళ్ళు నాపై పడవా? మీరు మరచిపోయినా మీ వేళ్ళు నన్ను తాకవా? అని అనుకున్నాను!
దానికి నేను సిగ్గుపడుతున్నాను…
తమిళాన్ని సరిగ్గా పలకలేని ఒక తమిళుడి నోటిలో చావడం కన్నా, తమిళం మాట్లాడలేని ఒక బొద్దింక నోట్లో చావడం మేలు…
“నేను మహాకవి కంబన్ రాసిన ఇతిహాసాన్ని!” 
“నేను తమిళ జాతీయ కవి భారతియార్ రాసిన పాటను!” 
“నేను వల్లువర్ రాసిన తిరుక్కురళ్ ని" “నేను కావ్యాన్ని!” 
“నేను కవిని!” 
"నేను నవలను"
“నేను కథను!” 
"నేను కవితను"
“నేను అమృతం వంటి పసిపాప పలికే భాషను!”
ఇంకా ఇంకా ఎన్నెన్నో
కానీ ఇంతలా ఉండి ఏం ప్రయోజనం?
ఇంకా రెండే పేజీలు… నేను పూర్తిగా అయోమయంలో పడిపోయాను!
దాని కంటే ముందు, ఒక చివరి కోరిక…
నా గుర్తింపును మీదిగా మార్చేయండి!
నేను పూర్తిగా నాశనమయ్యాక, ఊరికే "ఈ పుస్తకం పాడైపోయింది" అని రాసి అతికించకండి…!
==============================================
- తమిళంలో రచయిత మురుగన్

కామెంట్‌లు