తూరుపింట తొంగి చూసి
మార్పులెన్నో మంచివి
ఏర్చి కూర్చి తెచ్చునంట!
నిన్ను నీవు సిద్ధంగా
ఉంచుకోవాలంటూ
నియమమేదో చెబుతూ
నిన్ను హెచ్చరించునట!
గతమెంత కలత పెట్టినా
వెతలన్నీ పక్కకు తోసి
రేపటి వెలుగులో దారి
వెదుక్కోమనునట!
భయాలన్ని మూటకట్టి
బలం మనసులో కూడగట్టి
మదిలో గట్టిగా పట్టుబట్టి
ముందడుగు వేయమనునట!
రగులుతున్న మనసులో
సెగలుగక్కే నిర్ణయాలు
మిగిలిపోనివ్వకుండా
అమలు చేయమనునంట!
కొత్త రొజొకటి కానుకగా
కొత్త వెలుగు బాసటగా
కొత్త అడుగు వేయమని
చెప్పకనే చెప్పే వేకువ!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి