* అదృష్ట వంతులు*: - కోరాడ నరసింహా రావు


చిట్టి పొట్టి బాలలు   చిన్నారి బాలలు
 ఆట పాటల బాలలు
 అందాల బాలలు...! 

కల్లా కపటము ఎరుగని వయసులు...
  కల్మషము లేని మనసులు...! 

ఒకరితో  ఒకరు 
 ఇట్టే కలిసి పోతారు
 బాల్యపు మాధుర్యాన్ని
 హాయిగా అనుభ విస్తారు...! 

తిరిగి రాని బాల్యపు ఆనందాన్ని
 తనివి తీర అనుభ విం చండి... 

అందరికి అందని ఈ ఆనందము 
 అందుకున్నఅదృష్ట వం తులు మీరండి....!! 
     *****
కామెంట్‌లు