ప్రపంచ శాంతి, విద్య, పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితిమరింత కృషి చేయాలి : - సోషల్ వర్కర్ KVM వెంకట్
వికారాబాద్ జిల్లా కోకట్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐక్యరాజ్యసమితి (UNO) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త, కవయిత్రి మొల్ల కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు KVM వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, ప్రపంచ శాంతి ఆవశ్యకత, అంతర్జాతీయ సహకారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా KVM వెంకట్ మాట్లాడుతూ.. ప్రపంచంలో శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలంటే ప్రతి దేశం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, విద్వేషాలకు దూరంగా ఉంటూ మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి 1945 అక్టోబర్ 24న అధికారికంగా ఏర్పాటైందని, ప్రపంచ దేశాల మధ్య శాంతి, భద్రతలను కాపాడటం, మానవ హక్కులను పరిరక్షించడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోందని వివరించారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి అంశాల్లో ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు.
భారతదేశం అనుసరించిన అలీన విధానం అంతర్జాతీయ సంబంధాల్లో స్వతంత్ర నిర్ణయాలకు, శాంతియుత సహజీవనానికి ప్రాధాన్యతనిచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పరస్పర గౌరవం, సహకారం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఐక్యరాజ్యసమితి చాప్టర్ విద్యార్థులకు
ఎంతో ఉపయోగపడుతుందన్నారు
ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచానికి సవాళ్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని, మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలతో పెద్ద మార్పుకు నాంది పలకవచ్చని సూచించారు.
విద్యార్థులు కేవలం మంచి మార్కులు సాధించడమే కాకుండా, ప్రపంచ పౌరులుగా ఎదిగి శాంతి, సేవ, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలను జీవితంలో ఆచరించాలని KVM వెంకట్ ఆకాంక్షించారు.
“దేశాల మధ్య సరిహద్దులు ఉండవచ్చు.. కానీ మానవత్వానికి సరిహద్దులు ఉండకూడదు. శాంతి మన లక్ష్యం.. ఐక్యత మన బలం.. మానవత్వమే మన ధర్మం!”
ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు ప్రపంచ శాంతి కోసం దేశాలు కలవాలి.. మానవత్వం కోసం మనుషులంతా ఒక్కటవ్వాలి!”
అన్నా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరస్వతి వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి విద్యార్థులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి