11వ సర్వ (2): ఎడ్ల లక్ష్మి


ప్రజ్ఞాశాలి అయిన పర్వత రాజు మాటలు విని 
కోపముతో కన్నులెర్ర చేసి అతనితో ఇట్లనెను
ఓ హిమవంతుడా! నాకు భయపడి 
యుద్ధము చేయనని అనుకుంటున్నావా 

ఓ దుందుభీ! వాలి అను వానర వీరుడు గలడు 
అతడు యుద్ధము చేయుటలో ప్రముఖుడు 
ఆ వానరుడు కిస్కిందలో నివసించుచున్నాడు 
ఆచటికి వెళ్లి అతనితో నీవు యుద్ధము చేయుము 

దుందుభి హిమవంతుని మాటలను విని క్రుద్ధుడై 
వెంటనే అతడు కిష్కింద నగరమునకు వెళ్లెను 
ఆ పురద్వారమును ముక్కలు చేసి గర్జించెను 
ఆ ధ్వని వినిన వాలి అతని వద్దకు వచ్చెను 

ఓ దుందుభీ! నీ గురించి నాకు బాగా తెలుసు 
నీవు నాతో యుద్ధం చేసి నీ ప్రాణాలను కాపాడుకోమ్మని
వాలి అతనితో యుద్ధము చేయుటకు సిద్ధపడెను 
దుందుభిని గిరగిర తిప్పి నేలకు కొట్టెను.

దుందుభి లేచి వాలితో యుద్ధమునకు దిగెను 
అప్పుడు వాలి అతడిని పిడుగుద్దులు గుద్దెను 
వాలి దెబ్బలకు అతడు ప్రాణాలు వదిలెను 
అతని శవమును వాలి యోజన దూరమున విసిరేను.
కామెంట్‌లు