వానర రాజైన వాలితో వివరముగా తెలిపిరి
వాలి వానరుల మాటలు శ్రద్ధగా ఆలకించెను
వెంటనే మహర్షి దగ్గరికి వెళ్లి వేడుకొనెను
ఆ మహర్షి అతని మాటలు వినకుండా
తన ఆశ్రమంలోనికి వెళ్లిపోయెను
మహర్షి శాపమునకు వాలి భయపడి
వేనుదిరిగి తన స్థానమునకు చేరుకొనెను
ఓ రఘువరా! వాలి ఇచ్చటికి రాలేడని ఎరింగి
అమాత్యులతో గూడి ఇచ్చటనే యుంటిని
ఓ రఘురామా! వాలి బలము గూర్చి తెలిపితిని
అతనిని నీవు ఎలా చంపగలవు?
అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లు అనెను
ఓ వానరోత్తమా! శ్రీరాముడు వాలిని చంపగలడని
నీవు ఎలా నమ్మగలవో తెలుపుము
అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లనెను
లక్ష్మణా ఇచ్చట ఏడు సాలవృక్షములు ఉన్నాయి
వాలి ఒక్కొక్కదాన్ని పలుమార్లు భగ్నము గావించెను
శ్రీరాముడు ఒకే బాణముతోవాటిని ఛేదించినచో
వాలిని రాముడు చంపగలడని నమ్మెదను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి