సుగ్రీవుడు వాలి బలపరాక్రమముల గూర్చి శ్రీరామునకు వివరించుట
అతని ధైర్యము గురించి విన్నపిమ్మట
అతని లోతుపాతులు తెలిసిన పిదప
అనంతకర్తవ్యమును నిర్ణయింపుము
వాలి బ్రహ్మముహూర్తములో
నిద్రలేచి భూమినంతా చుట్టి వచ్చును
పర్వతములను బంతి వలె విసురును
వృక్షములను క్షణమున భగ్నమొనర్చును
ఒకరోజు దుందిబి అను మహా రాక్షసుడు
సముద్రని వద్దకెళ్లి యుద్ధము చేయుమనెను
ఆ సముద్రుడు నేను యుద్ధము చేయలేను
నీతో పోరు సల్పే సమర్ధుని గూర్చి తెలిపెద వినుము
ఈ అరణ్యమున హిమవంతుడను పర్వత రాజు గలడు
అతడు నీతో యుద్ధము చేయుటకు తగినవాడు
అతనితో నీవు ఎదురుపడి యుద్ధము చేయుము
సమర్ధునితో యుద్ధము చేసి ప్రీతి పొందుము
హిముడు తన పర్వతము మీద ఉండగా
ఆ రాక్షసుడు అతడిని యుద్ధము చేయుమనెను
ఓ దుందిబీ! నేను యుద్ధము చేయలేను
ఆశ్రమవాసినైనా నన్ను నీవు బాధించవలదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి