ఆ సుగ్రీవుడు మీతో మైత్రిని గోరుచున్నాడు
నేను వాయుపుత్రుడను అతని మంత్రిని
సన్యాసివేషంలో నేనిచ్చటికి వచ్చితిని.
శ్రీరాముడు హనుమంతుని పలుకులు విని
ఎంతో సంతోషించి లక్ష్మణునితో ఇట్లనెను
ఓ సౌమిత్రీ! సుగ్రీవుని మంత్రి అయిన ఈ వానరుడు
మాట్లాడుటలో మిక్కిలి సౌమ్యుడు
ఓ లక్ష్మణా! బుద్ధి కుశలుడైన ఈ దూతకు
మనము వచ్చిన కార్యము గూర్చి తెలుపుము
శ్రీరాముని మాటలు వినిన వెంటనే సౌమిత్రి
అతడు హనుమంతునితో ఇలా పలికెను
ఓ విద్వాంసుడా! సుగ్రీవుని గుణముల గూర్చి
కబంధునివలన ఇంతకుముందే విన్నాము
ఇప్పుడు ఆయన గూర్చి నీ వలన విని
మేము ఎంతయో సంతోషించితిమి.
వానర ప్రభువైన సుగ్రీవుని వెతుకుచు ఇటు చేరితిమి
హనుమంతుడు లక్ష్మణుని మాటలువిని సంతోషించి
సుగ్రీవునికి వాలి బాధలు తొలుగునని భావించెను
సుగ్రీవునకు వారితో మైత్రికై నిశ్చయించుకొనెను.
==================================
కిష్కింధకాండ మందు 3 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి