4వ సర్గ : ( 3 ): - ఎడ్ల లక్ష్మి


లక్ష్మణుడు ఆ హనుమంతుడిని 
దూతగా తగిన గౌరవ మర్యాదలు జేసి 
సౌమిత్రి శ్రీరామునితో ఇట్లు తెలిపెను
అగ్రజా! ఇక నీవు దుఃఖించుట తగదు. 

అన్నా! శ్రీరామచంద్రా! ఈ మారూతి
నా మాటలు విని మిక్కిలి సంతోషించి 
సుగ్రీవునికి మీ అవసరము ఉన్నదని 
జానకి నతడు వెతికించగలడని నుడివెను

హనుమంతుడు మాట్లాడినప్పుడు 
ఆయనముఖము ప్రసన్నముగా నున్నది
అతడు మిక్కిలి సంతోషముగా ఉన్నాడు 
ఆ మహావీరుని నోట అసత్యము రాదు"

మిక్కిలి బుద్ధిశాలియైన హనుమంతుడు 
రామలక్ష్మణులను వెంట తీసుకొని 
సుగ్రీవుని కడకు బయలుదేరెను 
మారుతి బిక్షరూపమును త్యజించెను. 

తన వానర రూపమును పొంది రామలక్ష్మణులను
తన భుజములపై చేర్చుకొని నడవసాగెను
హనుమ తాను ధన్యుడనని ఆనందించెను 
వారితో ఋశ్యముఖపర్వతమునకు చేరెను.

=================================

కిష్కింధాకాండమందు 4వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు