వాలి పంపగా వచ్చిన గూడచారివనుకుంటిని
మిమ్ములను సమీపించటకై భయపడితిని
అప్పుడు హనుమతో నిజము తెలుసుకొంటిని
ఓ రామా! నన్ను గూర్చి సంక్షిప్తముగా తెల్పితిని
ఆ వాలిమిక్కిలి బలపరాక్రవంతుడు
ఇంతకంటే ఎక్కువ చెప్పదగినదేమి లేదు
సుఖదుఃఖాలలో మిత్రుడే గదా! దిక్కు అని నుడివెను
సుగ్రీవుని పలుకులను విన్నపిమట శ్రీరాముడు
అతనితో ఇట్లనెను ఓ సుగ్రీవా! వాలికి, నీకు
వైరము ఏర్పడుటకు గల కారణము ఏమి?
భయపడకుండా నీవు నాతో తెలుపుము.
మీ వైర కారణము విని మీ గుణగణాల గూర్చి
పరిశీలించి తగిన యోచన చేయగలను
ఓ సుగ్రీవా! నీ గాథ వినిన పిమ్మట
నాకు కోపము ఎక్కువగా వచ్చుచున్నది.
అది నా హృదయమును కందింపజేయుచున్నది
నా ధనస్సును సంధించగానే నీ శత్రువు
ప్రాణములు ఎగిరిపోవును
అప్పుడు సుగ్రీవుడు వాలిగూర్చి తన గూర్చి
శ్రీరామునకు వివరించుచుండెను.
కిష్కింద కాండము నందు 8 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి