9వ సర్గ (2):- ఎడ్ల లక్ష్మి


నన్ను బిలము వద్ద కాపలాగా యుంచి 
అన్నయగు వాలి బిలములోకి ప్రవేశించెను 
అతడు ప్రవేశించి సంవత్సరము గడిచినది 
అయినా కానీ వాలి వెలపలకు రాలేదు 

కొంతకాలము గడచిన పిదప రక్తదారలు 
బిలము వెలపలకు పారుచు వచ్చెను 
రాక్షసుల కంఠధ్వని, వాలి బొబ్బలు వినబడెను
అప్పుడు నేను అన్న మరణించినట్టుగా భావించితిని. 

ఆ బిలద్వారమనకు పెద్ద బండరాయిని అడ్డుపెట్టి 
అచట నుండి బయలుదేరి కిష్కిందకు వచ్చితిని 
అచ్చట జరిగిన దంతయు తెలిపితిని 
మంత్రులు అందరు కలిసి నన్ను రాజుగా చేసిరి 

కొంతకాలము తర్వాత వాలి తిరిగి వచ్చెను 
నన్ను అపార్థము చేసుకుని దూషించెను
నేను అతడిని ఎంత వేడుకున్న గాని 
నా మనవిని అతడు వినిపించుకోనలేదు

అన్నా! నా అజ్ఞానముతో తప్పు జరిగినది 
నన్ను మన్నింపుమని ఎంతగానో వేడుకొంటిని 
అతని పాదాలపై ప్రణమిల్లితిని 
అయినా అతడు నన్ను క్షమించలేదు 
================================
కిష్కిందకాండము నందు 9వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు