ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇదో వినూత్న ప్రయత్నం!
చైనాలో ఎండ తీవ్రత నుంచి ముఖాన్ని కాపాడుకోవడానికి కొందరు యువతీయువకులు పెద్ద పెద్ద తామరాకులనే ముఖానికి ముసుగులా ఉపయోగిస్తున్నారు.
తామరాకుకు కళ్లకు, ముక్కుకు సరిపడా రంధ్రాలు చేసి, దాన్ని టోపీకి అమర్చి ధరిస్తున్నారు. ముఖ్యంగా జెజియాంగ్, సిచువాన్, ఫుజియాన్ ప్రాంతాల్లో ఈ వింత ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రకృతిలో సహజంగా లభించే ఆకులను ఇలా ఉపయోగించడం చూడటానికి కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అయితే, తామరాకులు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడతాయనే విషయానికి ఇప్పటివరకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
అందుకే, తామరాకులను సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయంగా భావించకూడదని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి