బ్యాక్ ఎండ్ స్టోరీ!: - కొత్త విరిత


 ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది… కాకపోతే మనం అనుకునే కథ బయటకు కనిపించదు, వినిపించదు!
బయట నవ్వుతూ తిరుగుతుంటాం, లోపల ఎన్ని యుద్ధాలో ఎవరికి తెలుసు? ముఖాన చిరునవ్వు పెట్టుకుంటాం, మనసులో ఎన్ని గాయాలో ఎవరికి తెలుసు?
ఉదయం లేవగానే బాధ్యతల బండి,
రాత్రయ్యేసరికి ఆలోచనల దండీ! ఆఫీసులో బాస్ మాటలు, ఇంట్లో సమస్యల మూటలు!
నచ్చని మాటలు వింటాం, నవ్వుతూ తలూపుతాం, నచ్చిన వాళ్లే బాధపెట్టినా ఏమీ తెలియనట్టు నటిస్తాం!
కలలు కనమంటారు, కలల కోసం కష్టపడమంటారు, కానీ ఆ కలల మధ్య వచ్చే కష్టాల గురించి మాత్రం మాట్లాడరు!
ఓపిక పట్టమంటారు, సర్దుకుపోమంటారు, అవసరమైతే మనసునే చంపుకుని నవ్వమంటారు!
ఎవరి జీవితంలో వాళ్లే హీరోలు, వాళ్ళే విలన్లు, మధ్యలో వచ్చే సమస్యలన్నీ ఉచితంగా వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టు లే!
నిజానికి ప్రతిరోజూ మనిషి ఒక యుద్ధమే చేస్తున్నాడు, కత్తి పట్టకుండా, కేకలు వేయకుండా కేవలం మౌనంగా! 
బయట నుండి చూసేవారికి
కనిపించేది వాళ్ల కథలో ముందు పేజీ మాత్రమే, వాళ్లు తట్టుకున్నది మాత్రం ఎవరికీ కనిపించని బ్యాక్ ఎండ్ స్టోరీ!
కామెంట్‌లు