ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ జన్మ!
మరల మరల మరుజన్మనందు పొందెదమో
లేక పొందుటకు భాగ్యము లేకుండునో
ఎరుక తెలియనిదే కదా ఎవరికైనా!
అపురూపం , దేవుడిచ్చిన వరం ఈ జన్మ
పరోపకారగుణంతో నలుగురికీ మేలు చేస్తూ,
ఆత్మీయతానురాగాలను అందరికీ పంచుతూ,
కరుణామృత ధారలను పరులపై కురిపిస్తూ
బ్రతికినన్ని నాళ్ళు ఆనందంగా బ్రతకాలి!
జీవితం క్షణభంగురమని విదితమే కదా!
రేపటి ఉదయాన్ని ఎవరు చూడగలరో
ఎవరికైనను ఎరుక ఉన్నదా ఈ జగాన?
మరెందుకు పగలు ప్రతీకార జ్వాలలు
మారణహోమాలు, అశాంతి నిండిన ఆలోచనలు?
జీవిత తత్వాన్ని ఎరిగి మసలుకుంటూ
ప్రతిక్షణం దైవచింతనలో గడుపుతూ
నీలో ఉన్న పరమాత్మను దర్శించి
నిన్ను నీవు తెలుసుకుంటేనే కదా
నువ్వెత్తిన ఈ మానవ జన్మకు సార్థకత!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి