భారతీయులం మనం- భరతమాత ముద్దుబిడ్డలం: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల


మనిషిని ఆధ్యాత్మికంగా
ముందుకు నడిపేదే మతం
పాపపుణ్యాల విచారణతో
ధర్మాధర్మాల విచక్షణతో
మనిషిని సన్మార్గం వైపు 
మళ్లించేందుకు ప్రయత్నించేదే మతం

మతంకన్నా గొప్పది మానవత్వం
గొప్పదే సర్వమానవ సౌభ్రాతృత్వం

హిందువైనా ముస్లిమైనా
బౌద్ధువైనా జైనుడైనా 
క్రైస్తవుడైనా సిక్కు అయినా
నమ్మి కొలిచే దైవం ఎవరైనా
పూజించే మందిరమేదైనా
మనమందరము భారతీయులమే
భరత మాత ముద్దుబిడ్డలమే 
అని మనసున మరువకూడదు

భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుతూ
అందరం ఐకమత్యంతో మెలగుతూ
చేయి చేయి పట్టి ముందుకు సాగుతూ
ప్రగతి దారులలో పయనించాలి
దేశ సమైక్యతను కాపాడాలి
దేశ భద్రతకు బాసటగా నిలవాలి
కామెంట్‌లు