సుమతీ శతకం ౨ వ పద్యం. అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుకు బ్తుకవచ్చు మహిలో సుమతీ! తా : ఓ మంచి తెలివి / బుద్ధి గలిగిన వాడా / సుమతీ ... మనకి అవసరమైనప్పుడు అడిగితే జీతమివ్వని, తనకు కలిగిన సంపదతో గొప్పలు ప్రదర్శించే యజమాని దగ్గర పనిచేయడం తెలివిలేని తనం. అంతకంటే, వేగంగా పరుగెత్తగల రెండు ఎద్దులు తీసుకుని పొలం పనులు చేసుకోవడం చాలా గౌరవంగా వుంటుంది.. ..అని సుమతీ శతకకారుని వాక్కు. *ఎటువంటి వానికైనా పరాధీనత కన్నా, స్వశక్తితో ఎదిగే ప్రయత్నం చేయడం ఉత్తమం* అని భావం. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు