*ఓటుహక్కు*- *సద్వినియోగం*:- - జి. లింగేశ్వర శర్మ-సిద్దిపేట
*కం-1*
దేవుని హుండీ లోపల 
గావుముమమ్ములనటంచు*
కానుక లెన్నో!
నీవర్పించిన చాలదు
 రావా? నీవోటువేయ*
రాజ్యముకొరకై!
       
*కం-2*
నోటుకయి ఓటు నమ్మక
ధీటుగ మనమంత గూడి*
దేశముకొరకై!
పాటిగ ధర్మము తప్పక
ఓటును వినియోగపర్చు* 
టొప్పగు ధరణిన్!

*కం-3*
మాటలు మరచినవారికి
ఓటేనాయుధముసుమ్మి*
యోడించంగా!
ఓటరుమహాశయా!విను
మోటునువేయగను రావె*
యోపిక తోడన్!


*కం-4*
గారడి మాటల తోడుత
జోరుగ పథకాల జూపి*
జోతలనిడుచున్!
చేరెడి నేతలు మీకడ
మీరేదేవుళ్ళటంచు*
మెచ్చును పై పై!

*కం-5*
మాటల జెప్పుచు నేతలు 
కోటలు గట్టెదర వెన్నొ*
కూరిమితోడన్!
ఓటును వేయమటందురు!
పోటీపడివిజయపథము*
పొందుటకొరకై!

*కం-6*
ఓటరులారా! వినుడీ
మేటిగసేవలనుజేయు*
మేలగునేతన్!
పోటీలోగెలిపించుడి 
ఓటునువినియోగపర్చి*
యోరిమితోడన్!

*కం-7*
విత్తము,మద్యపు,మాయల
చిత్తముపడకుండనిలిపి*
చేతనమతితో!
సత్తా జూపెడు నేతల
నుత్తములనె యెన్నుకొనుట*
యుజ్వల భవితౌ!

*కం-8*
ఓటుకు విలువను పెంచుచు
నోటరుగాదేశభవిత*
నుప్పొంగుగతిన్!
ఓటేనీయాయుధమని
చాటుచునీవోటువేయ*
సద్వినిమయమౌ!


కామెంట్‌లు