ప్రపంచ కథా సాహిత్యానికి ఆదిపురుషుడైన గుణాడ్యుడు నడయాడిన నేల మంజీర దేశమని పిలవబడిన మెదక్ జిల్లా ప్రాంతం. మెదక్ పట్టణానికి, కొండాపూర్ కి విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట కళల కాణాచి. సంగీత సాహిత్య కృషి కి ప్రసిద్ధి ప్రసిద్ధిపేట. కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన ప్రాంతం సిద్దిపేట. చైతన్యానికి మూలసుక్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో 2016 అక్టోబర్ 11న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ; ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాలతో నూతనమైన సిద్దిపేట జిల్లా ఏర్పాటయింది.
ఇక్కడి కథలు సాంఘిక సమకాలీన అంశాలను పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చిత్రించాయి. సిద్దిపేట జిల్లాలోని తొలి కథ గజ్వేల్ మారుమూల ప్రాంతమగు వడ్డేపల్లికి చెందిన బెల్లంకొండ వెంకటాచార్యలు ‘భక్త విజయం’ అనే కథ రాశారు. వీరు సోదరులు బెల్లంకొండ నరసింహాచారి ‘దేశబంధు’ అను పత్రికను 1927-30 మధ్యకాలంలో నడిపారు. వీరిద్దరూ వడ్డేపల్లి సోదరులుగా, జంటకవులుగా వీరు పలు రచనలు గావించారు. తెలుగు సాహిత్యంలో వెట్టి విధానానికి వ్యతిరేకంగా మొట్టమొదటి ‘సియాసీ సభలు’ అను కథలు రాశారు. వెట్టి కి వ్యతిరేకంగా మొట్టమొదటి సారిగా కథ రాశారు అని ప్రసిద్ధ కథా పరిశోధకుల అభిప్రాయం.
ముదిగొండ సాలగ్రామ్ సిద్దిపేటలో జన్మించారు. వీరు రాసిన కథ ‘ట్యూబ్ లో కన్నీరు’, వెన్నెల విరిసిన రాత్రి'1956లో రేడియోలో ప్రసారమైంది.
తిరుమల యదగిరిరావు 6 మార్చి 1922న చేర్యాల పట్టణంలో జన్మించారు. 1943 ప్రాంతంలో "తప్పేమి" లాంటి కథలు "భక్తగీత" పద్యసంపుటిని, "రాజకీయ వ్యాసములు" వ్యాససంపుటిని, కులశేఖరఆళ్వారు రచించిన "ముకుందమాల" కావ్యాన్ని "భక్తిమాల" పేరుతో తెలుగులో సరళమైన పద్యాలతో అనువదించి 1960 లో పాఠకులకు అందించారు. వినయభూషణ(నాటకము), గ్రంథాలయ భజనమాల, ఖండకావ్యములు, మరొక పద్యసంపుటి నేటికీ అముద్రితములుగానే ఉన్నాయి. జనపదులపాటలు, స్త్రీలు పాడుకునే హారతిపాటలు అనేకం వారి కలం నుండి జాలువారినవి. యాదగిరిరావు 52 సంవత్సరాల వయసులోనే 1974 లో కైవల్యం చెందారు.
డిప్యూటీ ఏ.ఈ. గా రిటైర్ అయిన బదునపల్లి గంగారం (1939-2015) ‘మంగళం లో అమంగళం’ అను కథతో పాటు మరో 14 కథలు రచించారు.
ఈశ్వర చరణ్ ‘జలజ నేర్చిన పాఠం' అను కథ రాసారు. ముదిగొండ ఈశ్వర చరణ్ సిద్దిపేట లో జన్మించారు వీరి రచనలు ‘విశ్వనాథ’, తారావళి సర్వేశ్వర ‘తారావళి’, ‘వివేకవాణి’, ‘శైవలిని’, ‘వెలుతురు’, వచన కవితలు. ‘నవమి’, ‘వ్యాసపీఠం’ సాహిత్య వ్యాస సంకలనాలు.
మనస్తత్వాలను చిత్రిస్తూ తెలంగాణ యాసలో భాషలో అనేక కథలు రచించినది. ఉమాపతి పద్మనాభ శర్మ సిద్దిపేట పట్టణంలో 1936లో జన్మించారు. ‘బతకనేర్చిన మృత్యువు’, ‘చంక్రమణం’, ‘మరపురాని వసంతం’, ‘చీకటి కురిసిన రాత్రి’, ‘సుప్త చైతన్యం’, ‘మసిబారిన చంద్రుడు’ మొదలైన కథలు రాశారు. ఉమాపతి పద్మనాభ శర్మ వచన కవిత్వం పద్య కవిత్వం రచించాడు. వీరికి 2021 సంవత్సరానికిగాను రాష్ట్ర ఉత్తమ కవిగా సన్మానించబడినారు.
తెలుగు సాహిత్యాన్ని మేల్కొలిపిన దిగంబర కవితోద్యమ నేత జ్వాలాముఖి. పూర్తి పేరు వీరరాఘవాచార్యులు. వీరు జన్మించింది 1938వ సంవత్సరం. వీరి స్వస్థలం దుబ్బాక మండలం ఆకారం. వీరు స్థిరపడ్డది హైదరాబాద్ లో. ప్రజా సాంస్కృతిక ఉద్యమకర్త మహా వక్త.
రచనల్లో అభ్యుదయ విప్లవ భావాలు కనిపిస్తాయి. తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకున్న కూతురు. కూతురు భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు తండ్రి. తిరగబడ్డ ఊరి జనంపై కేసులు పెడతాడు తండ్రి. యావజ్జీవ శిక్ష పడిన పెరుమాలయ్య శవాన్ని ఊరంతా కలిసి శవ యాత్ర చేస్తారు. ఒక మాల పిల్లవాడు నిప్పు పడుతూ నడుస్తాడు. ధ్వజస్తంభం మీద గీతా శ్లోకం ముక్కచెక్కలై కనబడుతుంటే దొర కూతురు పెళ్లి చేసినా ఆచారి కొడుకు చూసి చదివాడు మా ఫలేషు కదాచన. ‘మాఫలేషు కదాచన’ కథలోనిది.
కథా సాహిత్యంలో తెలంగాణ నేల నుంచి దళిత అస్తిత్వాన్ని కేతనంగా ఎగరవేసిన రుద్రవరం ఎల్లయ్య 1940లో హుస్నాబాద్ లో జన్మించాడు. వీరు తొలి కథ 1964 లో రాశాడు. 'రిజర్వేషన్ లు ఎందుకు?', 'పావురాలు', 'అక్షర శక్తి' అనే కథా సంపుటాలను ప్రచురించారు.
కథకులు, నటుడు, దర్శకుడు సిహెచ్ నారాయణ దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో 1941లో జన్మించారు. వీరు యాభైకి పైగా కథలు రచించారు. వందకు పైగా నాటకాల్లో నటించారు. దర్శకత్వం వహించారు. వీరి రచనలు 'కథాప్రపంచం', కొత్త గులాబీ', 'ఆమె' పద్యకావ్యం మొదలైనవి రాశారు.
కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధులు వంగగాల్ రెడ్డి రంగదాంపల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలో జన్మించారు. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారు 1531 రోజులపాటు ప్రత్యేక రాష్ట్ర ఆశయాన్ని చాటడానికి దీక్ష శిబిరం నడిపారు. 'కదం కదం', 'నేలతల్లి' కవితా సంకలనాలు వెలువరించారు 'నడకే నా ఆయుధం', 'ఆ ఒక్కటి పుట్టకపోతే' కవితా సంపుటాలు వెలువడపోతున్నాయి
సిద్దిపేట మండలం దోర్నాల గ్రామానికి చెందిన కె. వై. గిరి 1945లో జన్మించారు వీరి తొలి కథానిక ‘ఆరని జ్యోతి’ ఇందులో ప్రేమికుని పెళ్లి చేసుకోలేక పోతున్నాను అని మరణవాంగ్మూలం రాసి తనువు చాలించారు సరోజ. వీరు దాదాపు పది కథలు రాశారు.
కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో గొల్లపల్లి పట్టాభిరామ్ శర్మ 1945 లో జన్మించారు. దేవి మానస పూజ'పద్య కవితా సంపుటి 20కి పైగా కథలు రచించారు. చంక్రమణం నవల.
నటుడు, రచయిత, చిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని సినిమాగా తీసి జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఖ్యాతిగాంచిన మహనీయుడు బి. నరసింగరావు ప్రజ్ఞాపూర్ 1946 లో జన్మించారు. ‘రంగులు రాగాలు’,అనే కవితా సంపుటి ప్రచురించారు. తెలంగాణ సాయుధ రైతాంగ )పోరాటాన్ని ‘మా భూమి’ సినిమాగా తెరకెక్కించాడు. వీరు ‘దాసి’, ‘ఊరు’, 'మట్టి మనుషులు’, ‘దివిటీ’, ‘హరివిల్లు’లాంటి సినిమాలు నిర్మించాడు ‘దాసి’ సినిమా సినిమా ఎన్నో జాతీయ పురస్కారాలను అందుకున్నది. వీరు జననాట్యమండలి వ్యవస్థాపకులు. వీరి కథ ‘చలి’ దీన దరిద్రులు చలికి పడిన పాట్లను వివరించింది.
పద్య కవి, నటుడు, రేడియో అనౌన్సర్గా, పదవి విరమణ పొందిన ఉమాపతి బి. శర్మ సిద్దిపేట పట్టణంలో 1944 లో జన్మించారు వీరు ‘ దేవిమానస పూజ’ పద్య కవిత్వం. ‘భువన విజయం' నాటకం రాశారు.
కథాశిల్పి ఐతా చంద్రయ్య 1946 సంవత్సరంలో సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో జన్మించారు. వీరి తొలి కథ 1965 లో ప్రచురితమైంది. ‘మంచు ముద్ధ’, ‘కలికి గాంధారి’, ‘వరాల మూట’, ‘విముక్తి’, ‘బామా సాహి’ మొదలైన వాటితో పాటు 22 కథాసంపుటాలు తెచ్చాడు. పన్నెండు నవలలు, 12 రంగస్థల నాటికలు, వ్యాసాలు మొదలైనవి రాశారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన వీరు అనువాదాలు చేశారు. వీరి కథలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. దాదాపు ఏడు వందలకు పైగా కథలు రాసి తెలుగు సాహిత్యానికి అందించాడు.
కంశ్రీ అనే పేరు గల కవి, రచయిత కందుకూరి శ్రీరాములు. సిద్దిపేట మండలం రావురూకుల గ్రామానికి చెందిన వీరు 1951 లో జన్మించారు. ‘రావురూకుల’, ‘అలుకు పిడచ’ మొదలైన కవితా సంపుటాలు 10 వెలువరించారు. 1980 దశకంలో ఆనాడున్న ప్రధాన పత్రికల్లో వీరి కథలు అచ్చు అయ్యాయి. ‘లీల’, ‘రథం’, ‘జయశ్రీ’, ‘ప్రేమించిన మనిషి’, ‘కర్టెన్’, ‘ఆహుతి’, ‘మూగ పుట్టుక’, మొదలైన కథలు పేరుగాంచినవి.
‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ అనే గీతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిగాంచిన మాస్టార్జి పూర్వీకులది బయ్యారం గ్రామం. ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ‘దరకమే’ ఐక్యవేదిక కార్యదర్శిగా పనిచేశారు. కథలు, కవిత్వం, మూలవాసుల పాటలు, నాటకాలు ఎన్నో రచించాడు. అగ్రకులాలకు దళితులతో అవసరం వస్తే కుల వివక్షత అంటూ ముట్టు ఉండదు. అవసరం లేకుంటే అంటూ ముట్టు ఉంటుందని చెప్పే కథ ‘అవసరం వస్తే’ ఇలాంటి కథలు దాదాపు 15 వరకు రాశాడు.
తెలంగాణ జన జీవితాన్ని పోరాట పంథాను అక్షరీకరించిన సుప్రసిద్ధ నవలాకారుడు కథా రచయిత సరిపల్లి కృష్ణారెడ్డి సిద్దిపేట పట్టణంలో 1953లో జన్మించారు. వీరి ప్రఖ్యాతిగాంచిన నవల ‘ఉప్పెన’. ఈ నవల ఇతివృత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆవిష్కరించింది. ఈ నవల తమిళంలోకి అనువాదమైంది. 1975లో వీరు నవసాహితి సంస్థను ఏర్పాటు చేశారు. వీరు దాదాపు 30 కథలు. ఆరు నవలలు. దాదాపు నలభై వ్యాసాలు రాశారు. ‘బిగిసిన పిడికిళ్లు’ అను వీరి కథలో గొల్ల యాదయ్య చెట్లు నరికి నందుకు గదిలో బంధించిండు దొర. విడిపించడానికి వచ్చిన కులపోళ్లు దొర కాళ్లు పట్టుకొమ్మన్నరు. వాళ్ళ మాట కాదని తిరగబడ్డాడు యాదయ్య. యాదయ్య, అతని భార్య ఇద్దరు దొర తుపాకీ తూటాలకు అందరు చూస్తుండగానే బలయ్యారు. అక్కడున్న వారిలో మార్పు ఆవేదన దావాగ్నిలా దహించివేస్తుంది. తత్ఫలితంగా దొరల పై తిరగబడ్డానికి అందరి పిడికిళ్లు బిగుసుకున్నాయని ముగిస్తాడు నవలలు 'ఆమ్రపాలి', 'అమ్మడు', 'కడలి వెన్నెల', 'మంటలూ మానవత్వం'.
కథల తాతయ్యగా పేరుగాంచి బడి పిల్లలకు కథలు రాయడం ఎలాగో తెలియజేస్తున్న వీరు 17-12-1953 ఎల్సాన్పల్లి సిద్దిపేట లో జన్మించాడు. బాల సాహితీ మిత్రులు ఎన్నవల్లి రాజమౌళి. వీరి తొలి కథ ‘చదువురాని మంగమ్మ’, ‘పది రూపాయలకు లక్ష వడ్డీ’, ‘మానవత్వం’, ‘మతాతీతం’, ‘అత్త కాదు అమ్మ’, అమ్మ ఫోటోనైత’ మొదలగు కథలు 20కి పైగా రాశారు. వీరి కథా సంపుటి పేరు ‘పది రూపాయలకు లక్ష వడ్డీ’, కడలి కన్నీళ్లు నవల. బాల గీతాలు బాల కథలు కూడా రాశారు.
ఆకట్టుకునే శైలితో కవిత్వం, కథలు రాస్తున్న సీనియర్ కవి మహమూద్ పాషా సిద్దిపేటలో 24 జూలై 1954 లో జన్మించారు. ‘ఆసరా' కథ ప్రశంసలు పొందినది. ఇప్పటివరకు దాదాపు ఐదు కథలు రాశారు. వీరి కవితా సంపుటి ‘ఉనికి’(1984). ‘కలువారా’, ‘ఫైర్మెన్ గీతం’, ‘శ్వేతపత్రం’ కవితా సంపుటాలు వెలువరించనున్నారు.
గులాబీల మల్లారెడ్డి 26-1-1956లో జ వృత్తిరీత్యా న్యాయవాది. మంచి కథకులు. ‘పల్లె పొలిమేర’, ‘జన మేవ జయతే’, ‘ఎన్కౌంటర్’, ‘కోర్టు రణభూమి వేయి యుద్దాలు’, ‘నా లక్ష్యం నా గమ్యం’ వీరు తొలి కథ ‘పంచ రాగి’,’లవ్లీ పేరెంట్స్’, ‘ఇది దేవత కథనే’, ‘ఎవరు కారకులు’,’రాలిన స్వప్నం’, ‘క్యాంపస్ లో వేపచెట్టు’, ఎద్దు ఎవుసం – సురుకుల వైద్యం’,’ప్రకృతి ప్రియురాలు మానవత’మొదలైన కవితా సంపుటాలు. వీరి కథా సంపుటి పేరు ‘జర్నలిస్టు కథలు.’ వీరు జర్నలిస్టుగా ‘గులాబీ’, ‘ప్రజా పత్రిక’ ద్వారా ఎంతోమంది నూతన కవులను, రచయితలను సాహితీ లోకానికి పరిచయం
తెలంగాణ సాహితీ పెన్నిధి. సాహిత్య సంస్థల సన్నిధి. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి బందారం గ్రామం కొండపాక మండలంలో 1954లో జన్మించారు. 2021-22మధ్యకాలంలో ‘బందారం’ కథల పేరిట మూసీ పత్రికల్లో క్రమానుగతమైన కథలు ‘బందారం కథలు' రాస్తున్నారు. వీరు ఏది రాసిన నిత్యనూతనం. విశ్వజనీనంగా ఉంటుంది. కథల్లోనూ కవిత్వం ప్రవేశపెట్టడం ప్రత్యేకత.
తల్లి కోరిక మేరకు కొడుకులు తల్లిని దహనం చేయాలనుకుంటారు. డప్పులు కొట్టే దళితులకు ఆ తల్లి కొడుకులకు పైసల కాడ మాట బెణుకుతుంది. అటు కాష్టం కాలక ముందే మాది గూడెం మంటల్లో తగలబడి పోతుంటది. ఈ కథ పేరు చిత్ర కన్ను. సిద్ధోగం చేసిన తర్వాత ఎల్లమ్మకు ‘చిత్రకన్ను’ పెడితే ఎల్లమ్మ చూపు ఎంత దూరం ఉంటే అంత దూరం ఉన్న ఏ జీవి అయినా మాడి మసి అవుతుందని నమ్మకం. ఈ కథ కూడా అగ్రవర్ణాలతో గొడవకు దిగిన దళితుల పరిస్థితి అలాగే ఉందని చిత్రించిన కథ. ఈ ‘చిత్రకథ’ 1979 జూలై రాశాడు.
ఈ కథ ముందే ఊహించి రాసాడా? అని అనిపిస్తుంది. ఎందుకంటే కథ రాసిన ఐదు సంవత్సరాల తర్వాత దేశాన్ని కుదిపేసిన కారంచేడు సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వీరి కథలు ‘కుల కశ్పి’, ‘హృదయం’, ‘సిల్లీ గర్ల్స్’ ‘పుల్లర’, ‘పాముల మధ్య చీమ’ మొదలైన ప్రసిద్ధ కథలు. వీరి కవితా సంపుటాలు ‘భూమి స్వప్నం’, ‘సంభాషణ’, ‘ప్రాణహిత’, ‘ఒగ బాధ కాదు’, ‘నీళ్ల మనసు’, ‘నాగేటి సాల్లల్ల...’ అనేది వీరి పాటల సంపుటి. చిత్ర కన్ను’ కథా సంపుటి. ‘పరావర్తనం’, ‘ఇగురం’ వ్యాస సంపుటాలు. మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు.
జనం మెచ్చిన జర్నలిస్టుగా, జర్నలిస్టు నాయకునిగా తన ప్రస్థానం అందరికీ ఆమోదయోగ్యంగా మార్చుకున్నాడు కథకుడు కవి సుపరిచితులు కొమరవెల్లి అంజయ్య 1955లో సిద్దిపేట పట్టణంలో జన్మించారు. 1973 నుంచి కథలు, కవిత్వం రాస్తున్నారు. 20 కి పైగా కథలు రచించారు. పేదలకు ఉన్నత వర్గాలకు ఉన్న తారతమ్యాన్ని వ్యక్తీకరించిన కథ ‘వరదలు’. వీరి కవితా సంపుటాలు ‘గీతాయుధం’, ‘నడక బోనం’, ‘ఆకులు రాలుతున్నయి’. సాహితీ వికాస మండలి, మంజీరా రచయితల సంఘం ప్రధాన బాధ్యతలు చాలాకాలంపాటు చూశారు.
దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి చెందిన దాసరాజు రామారావు 1955 లో జన్మించాడు కొన్ని కథలు అనేక పాటలు రచించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కొన్ని పాటలు రచించారు. ‘గోరు కొయ్యలు’, ‘పట్టుకుచ్చుల పువ్వు’ వీరి కవితా సంపుటాలు. వీరి కథ ‘మట్టి ఎర్రబడింది’. ఊరి కరణం వద్ద మైసడు మస్కూరి. గిర్దావార్ ద్వారా జాగ ఇప్పిస్తానని ఆశ పుట్టిస్తాడు. ఖర్చులకి కానీ డబ్బులు వసూలు చేస్తాడు చివరకు మాదిగ రంగనికి అదే జాగను పట్టా చేయిస్తాడు. నాకు ఇస్తానని చెప్పిన జాగా పట్టా కాయితాలు మైసడు అడుగుతాడు. నువ్వు ఇచ్చిన ఐదు వందలకు నీకేం భూమి దొరుకుతదిరా గాడిది కొడుకా అది తిడుతున్నప్పుడు మైసడికి మైసమ్మ ఆవహించింది. మట్టి ఎర్ర పడ్డది.
సీనియర్ కవి రచయిత మహమూద్ పాషా రాసిన కథ 'ఆసర'.'తాయిమా' రెండు కథలు రాసారు. 10వరకు వ్యాసాలు రాసారు. త్వరలో కవితా సంపుటాలు తేవడానికి సిద్ధమవుతున్నాడు.
కవి, రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పక్కనున్న బెజుగాం గ్రామము. వారి మిత్రుడు చింతపట్ల సుదర్శన్ తో కలిసి సిహెచ్ ఎస్వి పేరుతో ‘పదహారేళ్ల వాడు’ అనే కథ రాశారు. ఈ కథ హైదరాబాద్ అభ్యుదయ రచయితల సంఘం సంకలనం చేసిన ‘కెరటాలు’ 1972లో అచ్చయ్యింది. వీరి మరో ప్రసిద్ధ కథ ‘వలస’, ‘అరిటాకు’మొదలైన కథలు రాసాడు.
నెమలికన్ను కవిగా కీర్తి పొందిన ఈ లేని గిరి దుబ్బాక మండలం ధర్మాజీ పేట లో 1961 లో జన్మించారు వీరు దాదాపు 20కి పైగా కథలు రాశారు లభ్యమవుతున్న కథ ‘శృతి లయలు’.
మరణానంతరం అక్షరాలై ఎగసిన కవి కీ.శే. పోగుల రాజన్న. వీరి మరణానంతరం వీరి మిత్రులు ‘సెలవింక’ అనే కవితాసంపుటి తెచ్చారు. అకాల మరణం పొందారు. భార్యను కాల్చేసి అబద్ధపు మరణవాంగ్మూలం ఇప్పించాడు భర్త. బిడ్డ మీద ప్రీతితో ఆమె అలానే చెప్పింది. అలా చెప్పకపోతే నీ కుటుంబాన్ని మన కూతుర్ని చంపేస్తానని బెదిరించాడని అందుకే అలా చెప్పానని ఎస్సైతో చెప్పింది. పెళ్లి కావాల్సి ఉన్న చెల్లెలు ఏదో సాధించాలని నిమగ్నమై పోయిందని ముగించిన కథ ‘మరణవాంగ్మూలం.’ మరో రెండు కథలు ‘బీడి బతుకులు’, వరకట్నం అంశాలపై కూడా కథలు రాశారు
తెలంగాణ సుప్రసిద్ధ కవి బహుగ్రంధకర్త అన్నవరం దేవేందర్ హుస్నాబాద్ మండలం పోతవరం గ్రామం లో 17 అక్టోబర్ 1962 లో జన్మించారు. బి.ఎస్.రాములు సాన్నిహిత్యంలో కొన్ని కథలు రాశారు.
అక్షరాలతో నాటకీయతను చూపించే నవలాకారుడు కథా రచయిత, కవి, విమర్శకులు, చొప్పదండి సుధాకర్ చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామంలో 1963వ సంవత్సరంలో జన్మించారు. ‘శబ్ద రుతువు’, కవితాసంపుటి. ‘జీవితం చేసిన సంతకం’, ‘బిజినెస్’, మొదలగు నాలుగు నవలలు. ‘వెన్నెల కుప్పలు’ కథాసంపుటి మొదలైనవి వెలువరించారు.
కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి చెందిన వంగర నర్సింహారెడ్డి 7 మార్చి 1964లో జన్మించారు. 'శ్రావణి', 'బంగారు ఉంగరం', 'బొగ్గు బావి' దాదాపు 12 కథలు రాశారు. 'తొలి కూత', 'సహచరి', వీరి కవితా సంపుటాలు.
సుప్రసిద్ధ కథకులు విమర్శకులు బివిఎన్ స్వామి కోహెడ మండలం వర్కోలు గ్రామంలో 16 డిసెంబర్ 1964 లో జన్మించారు. వీరి తొలి పరీక్ష 2000లో ప్రచురితమైంది. రాత్రి పగలు మొదలైన కథలతో పాటు దాదాపు 100 కథ రాశాడు. విమర్శ వ్యాసాల్లో 'వివరం', 'కథ తెలంగాణ', 'అడుగుజాడలు'. కశప కథ శతక ప్రక్రియ అనే నూతన ఒరవడిని కథాసాహిత్యంలో సృష్టించారు.
సిద్దిపేట పట్టణంలో 1964లో జన్మించిన వి శ్రీనివాస్ ఇప్పటి వరకు ఐదు కథలు రాశాడు.
పదునైన కథనం, ఆకట్టుకునే శైలితో రాణిస్తున్న కథకురాలు శ్రీమతి ఏదునూరి రాజేశ్వరి 10 సెప్టెంబర్ 1966లో జన్మించింది. హుస్నాబాద్ మండలం పోతరం ఎస్ మెట్టినిల్లు. 'జయ జయహే తెలంగాణ'(2012), తొలి కథ రాసింది. 'అత్తా కోడలు', 'తెగింపు', 'కరోనా తెచ్చిన కలవరం' కథకు కరోనా శతాధిక కథా సంకలనంలో చోటు దక్కింది. 'వల్లనే వల్లనే'... మొదలైన కథలు రాసి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. రాజేశ్వరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సహచర్యంలో 'ఎన్నీల ముచ్చట్లు' కవి సమ్మేళనంలో కవిత్వమూ చదువుతోంది. తన కథల్లోని పాత్రలు తేట తెలంగాణ జీవభాషలో మాట్లాడుతారు...
‘మౌన సాక్షి’, ‘అరుగు’ కథా సంపుటాలతో దూసుకుపోతున్న వర్తమాన కథారచయిత వేణు నక్షత్రం జర్నలిస్టుగా సినీ నిర్మాతగా దర్శకుడిగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. వీరు సిద్దిపేటలో 1968లో జన్మించినా అమెరికాలో స్థిరపడ్డారు. వీరి తొలి కథ’పర్యవసానం’, ‘రైల్వే సత్యం’, ‘పిలుపు’ మొదలైన కథలతో పాటు ఇప్పటివరకు దాదాపు 25 కథలు రాశారు.
ఒకవైపు పాత్రికేయ వృత్తి మరొకవైపు అక్షరాలతో తిత్తితో కలంతో కత్తి దూస్తున్న కథా రచయిత బోయిని భాస్కర్ హుస్నాబాద్ మండలం, పోతారం గ్రామంలో 1970 ఆగస్టు 15వ తారీఖున జన్మించాడు. వీరి తొలి కథ 'కన్నెమోజు' (1993), 'దేవున్ని చూడాలని ఉంది', 'నల్ల మల్లి', 'ఆమె', 'వలస', 'మబ్బు పట్టిన వెన్నెల', బావొచ్చే యాల్లయ్యింది' మొదలైన కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి. దాదాపు 20 కథల వరకు రాశారు. త్వరలో కథా సంపుటి తేవడానికి సిద్ధమవుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నూ నవలలు రాశాడు. పదునైన శైలి, చదివించే గుణం, వీరి ప్రత్యేకత.
సాహితీ సాంప్రదాయాలు కలబోసిన కుటుంబంలో గుమ్మన్నగారి బాల సరస్వతి పదివేల 1971లో దుబ్బాక మండలం పోతరెడ్డిపేట్ లో జన్మించారు. 'రామి' తెలంగాణ యాసలో రచించారు.
కోహెడ మండలం మండలం వింజపల్లి గ్రామానికి చెందిన సువర్ణ దేవి 14 డిసెంబర్ 1972లో జన్మించారు. వీరి తొలికథ 'మార్పు','ఆడ పిల్ల', 'పెంపకం', 'వెలుగుబాట', బాల్యం లాంటి కథలతో పాటు దాదాపు పది కథలు రాశారు. 'బతుకమ్మ', 'బొడ్డెమ్మ' ఉయ్యాల పాటల సంకలనాలు వేశారు.
తెలంగాణ నడుస్తున్న పద్యంగా కీర్తిగడించిన వేముగంటి నరసింహాచార్యులు గారి కుమారుడు వేముగంటి మురళి 1972లో సిద్దిపేట పట్టణంలో జన్మించారు. వీరి తొలి కథ జాతర తో పాటు దాదాపు 20 కథలు రాశాడు. ‘అలుకు బోనం’ కవితాసంపుటి ‘మునుం’ తెలంగాణ పుష్కర కవిత ‘జయశిఖరం’ కవితా సంపుటాలకు సంపాదకులు. తెలంగాణ జాగృతి చరిత్ర విభాగ సభ్యులు. వీధి తొలి కత ‘జాతర’, ‘ముక్కలైన రెక్కల కష్టం’ మొదలైనవి కథలు.
కవిగా పాటలు కవితా సంపుటాలు తెచ్చిన దాస్యం లక్ష్మయ్య హుస్నాబాద్ కు చెందిన వారు. వీరు కవి రచయిత. ‘హత్య’, ‘తల్లి పానం’, ‘సదువు’, ‘సిగ్గు’ మొదలైనవి వీరి కథలు.
గోనెపల్లికి చెందిన గజ్జల కనకరాజు పిల్లలు పెద్దలు ‘మానవీయం’, ‘ఉత్తరాల కట్ట’ మొదలైన కథలు రాశారు. వీరి కథలు హైదరాబాద్ ఆకాశవాణిలో .
దళిత అస్తిత్వ నివేదన తో జీవితం అల్లుతున్న కథకుడు తప్పెట ఓదయ్య 15 -10-1972లో బెజ్జంకి మండలం దాచారంలో జన్మించాడు. వీరి తొలి కథ 'మలక్క', 'మీరేంటోళ్ళు సార్', 'కలిమాయ', 'ఎంతెంత దూరం', 'మనాది' మొదలైనవి ప్రసిద్ధ కథలు. దాదాపు పది కథలు రాశారు. దళిత కథా వార్షిక సంపాదకులు. 'మొగ్గ పూసలు', 'అలకల పోత' వీరి కవితా సంపుటాలు.
ప్రపంచీకరణతో ధ్వంసమవుతున్న మానవీయ కోణాన్ని, బహుజన తత్వాన్ని అందిస్తున్న కథకుడు డా. వెల్దండి శ్రీధర్ కోహెడలో 15 ఏప్రిల్ 1973లో జన్మించారు. కథా కచ్చీరు పేరిట 2018 నుంచి గత నాలుగు సంవత్సరాలుగా కథాకాలం నిర్వహిస్తున్న విమర్శకులు, విశ్లేషకులు. తెలంగాణ కథావార్షిక సంపాదకులు. వీరి తొలి కథ 'అక్షరాలు ఏడుస్తున్నాయి (1997), 'పడుగు పేకలు' కథాసంకలనం. 'ఆసు' కవిత్వం. 'పొక్కిలి' వట్టికోట ఆళ్వారుస్వామి అవార్డు పొందిన కథ. 'నాలుగు కోట్ల పిడికిళ్ళు', 'పుంజీతం', 'పుండు', 'అంగడి', 'పాజిటివ్', 'కాసేపుల్ల', 'సజీవదహనం' మొదలైన కథలు. దాదాపు 18 కథలు రాశారు. 'పుంజీతం'కథాసంపుటి.
బాధల్ని, గాధల్ని ఇప్పుడు వీస్తున్న గాలిగా ప్రవచిస్తున్న కొండి మల్లారెడ్డిది పదునైన శైలి. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో 17-04-1973 లో జన్మించినారు. నూతన అభివ్యక్తి. నవ్యత, నాణ్యత వీరి ప్రత్యేకత. వీరి తొలి కథ ‘రంగధాంపల్లి చౌరస్తా’(2012) తెలంగాణ ఉద్యమ కాలంలో వలసవాదుల కుట్రల పసిగట్టిన కథ. ‘వాగవతల మడి’, ‘కొమ్ముల బర్రె’, ‘గూడు’, ‘బుగులు’ మొదలైన కథలు రాశాడు.
‘అలికిడి’, ‘శబ్ద భేది’, ఇప్పుడు వీస్తున్న గాలి’, ‘భిన్న రుతువు’ వీరి కథా సంపుటాలు. వెన్నెల సాహితీ సంఘమము వ్యవస్థాపక అధ్యక్షులు. వీరు, పర్కపల్లి యాదగిరి సంపాదకత్వంలో సిద్దిపేట కథలు, ‘మొలక మండె’, ‘ఉద్యమ కెరటాలు’, ‘పూలబోనం’, ‘ఇరుసు’, ‘ఎనగర్ర’ కవితా సంకలనాలుగా తెచ్చారు.
కోహెడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన డా. పొన్నాల బాలయ్య కోహెడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన 4 సెప్టెంబర్ 1973లో జన్మించిన. వీరి తొలికథ ‘గోరి’, 'స్మోక్ లెస్ కోల్', 'దుఃఖపు మేఘం' కథలతో పాటు పది కథలు రాశారు. 'ఎగిలివారంగ', 'దందెడ', 'మిగ్గు' వీరి కవితా సంపుటాలు. త్వరలో రాబోయే వీరి నవల లంద.
కోహెడ మం. నాగసముద్రాల గ్రామానికి చెందిన చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసిన కవి, కథకుడు డా. తైదల అంజయ్య 25-5-1975లో జన్మించారు. ‘ఒక తుపాకీ మాట’, ‘గుప్పెడు మట్టి’, ‘బతుకమ్మ’, 'వర్గ సమీకరణం’మొదలైనవి దళిత అస్తిత్వం తెలియజేస్తాయి. జీవితంలోని అనేక కోణాలను తెలియపరుస్తాయి. ‘పునాస’, 'ఎర్రమట్టి బండి' వీరి కవితా సంపుటాలు. త్వరలో రాబోయే కవితా సంపుటి 'జల తంత్రి', కథాసంపుటి 'మునుల చెలిమే'.వీరు చిత్రకారులునటుడు, పాటల రచయిత కూడా.
చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో డా. సిద్దెంకి యాదగిరి 30 జూన్ 1980 లో జన్మించారు. వీరు కవి, రచయిత, విమర్శకులు. వీరు ‘బోధ’, ‘తప్ష’, ‘ఎత’, ‘విరిగిన కల’, ‘కీలెరిగి వాత’, ‘అంటరాని బతుకమ్మ’, ‘తీర్మానము’, ‘పీడ’ మొదలైన కథలు రాశాడు. వీరి కథా సంపుటి ‘తప్ష' పల్లె పలుకుబడులు నుడికారం సామెతలు జీవ భాష వీరి ప్రత్యేకత. 'మా తొవ్వ', 'బతుకు పాఠం', 'అచ్చు', వీరి కవితా సంపుటాలు. 'తప్ష' కథా సంపుటి. త్వరలో రానున్న కథా సంపుటి 'రుణం'. వ్యాస సంపుటి 'ముక్వారు'.
వర్తమాన కాలంలో ఆధునిక జీవితాలను చిత్రిస్తున్న కథారచయిత్రి మా రోజు దేవేంద్ర దుబ్బాకలో 1982లో జన్మించారు. వీరి తొలి కథ తొలి కథ ‘అడుగులు’ ఇప్పటివరకు ఇరువై కథల వరకు రాసింది. ‘అడుగులు’ కథా సంపుటి..2020లో ప్రచురించారు.
1986లో గజ్వేల్ పట్టణంలో జన్మించిన వి. వంశీధర్ రెడ్డి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. వీరు తొలి కథ చౌరస్తా కినిగె పత్రికలో ప్రచురించబడింది. వీరి తొలి కథ - 'చౌరస్తా', ప్రచురణ - కినిగె ఈ పత్రిక, 2014 "జిందగీ" "ఐస్ క్యూబ్" "కీమో", " వెడ్డింగ్ ఇన్విటేషన్", "ఔటర్ రింగ్ రోడ్", "మనోరమ" కథలు రాశారు.
డాక్టర్ విట్టబోయిన వెంకటేష్ దుబ్బాకలో గ్రామంలో 1988లో జన్మించారు. తొలి కథ ‘బతుకుదెరువు’ఇప్పటి రాసిన మూడు కతలు రాశారు.
యువ కవి చెన్న రాజు దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో 10 ఆగస్టు 1990 జన్మించారు. వీరు రాసిన కథ ‘పయిలం బిడ్డ’ ‘సురువు’ కవితా సంపుటి తీసుకువచ్చారు.
తెలంగాణ కథ - సిద్దిపేట జిల్లా:
ఉమ్మడి మెదక్ జిల్లా లో హరిపురం వెంకట రామయ్య పంతులు కథ సమ్మేళనాలు నిర్వహించారు సాహితీ వికాస మండలి 1965లో చతురంగం పేరుతో నాలుగు కథలు ప్రచురించింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన రెండవ కథా సంకలనం గా ప్రసిద్ధి గాంచింది. చతుర రంగం కథాసంకలనంలో ఉమాపతి పద్మనాభశర్మ, శ్రీకాంతశర్మ, జలపల్లి చంద్రారెడ్డి, తూప్రాన్ వాస్తవ్యులైన డింగిరి నరసింహాచార్యులు రాసిన కథలతో ప్రచురించారు.
తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు కావడానికి మంజీరా రచయితల సంఘం ప్రధాన భూమిక పోషించింది. తొలి వ్యవస్థాపక అధ్యక్షులు గా నందిని సిద్ధారెడ్డి. తెరవే ఆధ్వర్యంలో తెలంగాణ సోయి పేరిట త్రైమాసిక పత్రికను తెచ్చారు. ఇందులో లో కీర్తి సంచికలో దాదాపు నాలుగు కథలు ఉండేవి.
మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో వేముగంటి రఘునందన్ గారు వట్టికోట ఆళ్వారు పురస్కారాన్ని ఒక దశాబ్దం పాటు నూతన కథకులకు బహుమతి ప్రధానం చేసి ప్రోత్సహించారు.
పోరాటాల గడ్డ బైరంపల్లి పురిటి బిడ్డ కర్ర ఎల్లారెడ్డిగారు తెలంగాణ సాహిత్యానికి ఎనలేని కృషి చేస్తూ అనేక పుస్తకాలను ముద్రించారు వీరు తెలంగాణ కథ వార్షిక 2000 -2010 మొత్తం ఎనిమిది వార్షిక సంచికలు తెచ్చారు.
మన తెలంగాణ 11 సంచికలు 2005 నుంచి 2012 మధ్య కాలంలో సాహిత్యం రూపంలో తెచ్చారు మన తెలంగాణ పత్రికలో తెలంగాణ కథకు నాలుగు కథలు చొప్పున చోటు కల్పించారు.
బి వి ఎం సంపాదకత్వంలో కర్ర ఎల్లారెడ్డి తెలంగాణ సాహితీ పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ చౌక్ అను ఉద్యమ కథా సంకలనాన్ని 2011లో ప్రచురించారు అంతేకాకుండా తెలంగాణ సాహితీ పబ్లికేషన్ నుంచి మొత్తం ప్రచురించిన పుస్తకాల సంఖ్య 56 పుస్తకాలు.
గుణాఢ్యుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మంజీర బిడ్డలైన మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో వేముగంటి మురళీకృష్ణ బెల్లంకొండ సంపత్ కుమార్ సంపాదకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా కథా సాహిత్యాన్ని కథల రూపంలో 2016 లో ప్రచురించారు.
తెలంగాణ కథా సాహిత్యాన్ని విశిష్ట స్థాయికి తీసుకుపోయిన వార్షిక తెలంగాణ కథావార్షిక సంపాదకులలో ఒకరైన వెల్దండి శ్రీధర్ సిద్దిపేట సిద్దిపేట జిల్లా కు చెందిన వారు కావడం కథా గౌరవం
సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తర్వాత వచ్చిన తొలి కథా సంకలనం సిద్దిపేట జిల్లా కథలు ప్రచురించినది వెన్నెల సాహితీ సంఘమము. కొండి మల్లారెడ్డి పరిక పల్లి యాదగిరి సంపాదకత్వం వహించిన గా రాగి చెట్టు మహేష్ ఆర్థిక హార్దిక సహకారం అందించాడు.
దేశంలోనే తొలి దళిత కథా వార్షిక తెచ్చిన ఘనత జంబు సాహితీ సిద్దిపేట జిల్లాకు చెందుతుంది. ఈ దళిత కథావార్షిక పేరు ‘తొండం బొక్కెన’గా నామకరణం చేసి సంపాదకత్వం వహించిన వారు డాక్టర్ సిద్దెంకి యాదగిరి వోదయ, గుడిపల్లి నిరంజన్ సిద్దిపేట జిల్లా వారే కావడం విశేషం.
- డా. సిద్దెంకి యాదగిరి 9441244773

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి