ఆరోజు బడికి లేటైంది. ఎప్పుడూ తెల్లవారుఝామునే లేచి వంటవండి క్యారియర్ లో సిద్ధంచేసే అమ్మ ఆరోజెందుకో ఆలస్యం చేసింది.కట్టెల పొయ్యి.మట్టికుండలో వంట చేయాలి.అప్పుడు గ్యాస్ స్టౌలెక్కడివి. మంటఆరిపోతే ఊదరకొయ్య నోటిదగ్గరపెట్టి వూదాలి.మంటను మండించాలి. చాలా కష్టమే వంటచేయడం.అలా ఒకటా రెండా జీవితమంతా మట్టి పొయ్యి మీదనే వండింది అమ్మ. ఆరోజు ఆలస్యమైందని కోపంతో నేను సంగటి కట్టితో వంటవండుచున్న మట్టి కుండను పగులగొట్టి దౌడుతీశాను. అక్కడే వుంటే మానాయనకు తెలిస్తే నాకు పెళ్లి చేసేస్తాడు. పట్టుమని పద మూడేళ్లు లేవు. అంతకోపమెందుకురా నీకు అంటూ తరిమి తరిమి కొడుతాడు.మానాన్నకు దొరుకుడేలేదు. పారిపోయా.సాయంఁతం వచ్చా మెల్లగా. అంతా మామూలే. ఁపశాంతంగానేవుంది.నాన్నలో కోపం లేదు. అంటే అమ్మ నాన్నకు చెప్పనే లేదు. నా సామిరంగా బతికిపోయా. మా అమ్మను గట్టిగా పట్టుకున్నా.తలనిమిరింది.మీనాన్నకు చెప్పలేదురా ... భయపడకంది.అమ్మ ఁపేమ నాకర్థమైంది. నా అమ్మ గొప్పది. అప్పటినుండీ నా అమ్మను ఒకమాటనలేదు. కోపగించుకోలేదు. పైగా అమ్మ వైపు పార్టీ మారిపోయా. అంతర్జాతీయ మహిళదినోత్సవసందర్భంగా అమ్మకు వందనం. పాదాభివందనం. అమ్మ ఆత్మకు శాంతి కలుగుగాక.....- యం .వి. రమణ 


కామెంట్‌లు