యుద్ధం యుద్ధం ..చిత్ర విచిత్ర యుద్ధం యుద్ధం యుద్ధం ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధం అవనిన మానవులంత కలిసి.. అదృశ్య శక్తితో చేసే యుద్దం(2) 1చ. కదనరంగము అసలే లేదు.. కనిపించే శత్రువు లేడు కత్తులు ఝుళిపించుటలేదు.. నెత్తురోడుట లేనే లేదు కడలిన పుట్టిన ఉప్పెనవోలే.. పల్లెపట్నాల కడతేర్చగా కరోన వేసెను సమ్మోహనాస్త్రం.. మనుషులకయ్యెను మరణశాసనం Il యుద్ధం ll 2చ. వీరతిలకం దిద్దుట లేదు.. వీరంగం అడుటలేదు వీరుడవై పోరు సల్పుట లేదు.. విఫణిన క్షిపణుల దాడులులేవు వీరువారని భేదం లేదు.. దేశాలు వేరని తేడాలేదు విశ్వమంతా ఐక్యమయ్యి.. విజ్ఞతతో చేసే పోరు 3చ. గడప దాటక కాలు కదపక.. మూతిని ముక్కును కప్పుకొని చేతులు కలపక చేతులు కడగుచు.. భౌతిక దూరం పెంచుకొని ఇంటిలోనే కాలక్షేపం.. ప్రభుత చూస్తుంది మన సంక్షేమం అన్నార్తులకు ఆపన్నహస్తం.. అందిస్తూ కదలాలి నేస్తం ll యుద్ధం ll *జి.మురళీధర్ రావు,* ఉపాధ్యాయుడు నాగర్ కర్నూల్. చరవాణి: 9441541955


కామెంట్‌లు