నేను హై స్కూల్ లో ఉండగానే బాగా బొమ్మలు వేస్తాననే పెరు వచ్చింది. కాలేజ్ లో చేరుతున్నపుడు మా టీచర్లు అందరూ bipc గ్రూప్ తీసుకోవాలని సూచించారు. బాగా చదివి డాక్టర్ అవుతానని కాదు.బొమ్మలు చక్కగా వేస్తుందని.ఇంకా తన పని తను చేసుకుంటూ ఎవర్నీ ఇబ్బంది పెట్టదని కూడా.అప్పట్లో bipc లో కూల్ గా ఉండే పిల్లలు ఉండాలని,డిసిప్లిన్ కలిగిన పిల్లలు తీసుకోవాలని చెప్పేవారు.సరే ఇవన్నీ కాదు గానీ నేను కాలేజ్ లో చదివిన 5 సంవత్సరాలు డ్రాయింగ్ పోటీల్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.ఇప్పుడు పెద్ద గొప్పేం కాదు గానీ అప్పట్లో కేవలం govt కాలేజ్ లు మాత్రమే ఎక్కువగా ఉండేవి.మా కాలేజ్ 1500 strength ఉండేది.మొదట్లో సరదాగా పోటీలో పాల్గొన్నా రాను రాను ఇష్టం పెరిగింది.దాంతో పాటు ప్రైజ్ వేరేవాళ్లకు వస్తే ఎలా అనే భయమూ వచ్చేసింది.చివరి సంవత్సరం చాలా టఫ్ గా ఎంకి అనే కాప్షన్ ఇచ్చారు.లెక్చరర్లు ఒక కాప్షన్ ఇచ్చి దాని ప్రకారం బొమ్మలు వేయమని చెప్పేవారు. ఇంటర్ డిగ్రీ లలో నాలుగు సంవత్సరాలు నాకే ప్రైజ్ వచ్చింది. ఫైనల్ ఇయర్ లో ఈ ఎంకి నాకు ప్రైజ్ తెస్తుందో లేదో నని నన్ను భయపెట్టింది. డిగ్రీ పాసవుతానో లేదో అనేకన్నా ఇదే ఎక్కువ ప్రెస్టేజ్ ఇష్యూ గా అనిపించింది. చివరకు ఎంకి బొమ్మ వేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టి నా ఛాంపియన్ షిప్ ను పోగొట్టుకోన0దుకు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోష పడ్డాను.ఇక్కడ పెట్టిన ఈ బొమ్మల్లో నేను 5 సంవత్సరాలు ప్రైజులు తెచ్చుకున్న బొమ్మలున్నాయి.వీటిని నేను డిగ్రీ తర్వాత చాలా భద్రంగా దాచుకున్నాను.ఇప్పుడు మీకోసం తీసాను బయటకు.మీకెలా అనిపించాయో చెప్పండి.- డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్


కామెంట్‌లు