అందమైన కుందేలు -- (బాలగేయం) పిల్లలమంతా కలిసాము పక్కన తోటకు వెళ్ళాము తోటలొ ఉంది గుబురు పొద పొదలో ఉంది కుందేలు కుందేలంటే కుందేలు అందమైనది కుందేలు బెదురు బెదురుగా చూసింది అటుఇటు గంతులు వేసింది అపుడే గడ్డిని తెంపాము కుందేటి కూనకు ఇచ్చాము తెల్లాతెల్లని కుందేలు హాయిగ తింటూ నవ్వింది మెరిసే కళ్ళతొ చూసింది చకచక చెవులను తిప్పింది వెదురు బుట్టలో కూర్చుంది ఎగురుతు ఇంటికి వచ్చింది మాతో స్నేహం చేసింది సంతోషాన్నే ఇచ్చింది. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు