సుమతీ శతకం పద్యం (౯౬-96) లావుగలవాని కంటెను భావింపఁగ నీతిపరుడు ! బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు! మహిలో సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ భూమి మీద మనిషి శరీర ఆకారంలో ఎంత పెద్దవాడైనా, సహజంగా చిన్న శరీరం కలిగి తన తెలివితేటలతో ఏదైన సాధించగలిగిన వాని ముందు ఓడిపోక తప్పదు. ఎలా అంటే, చిన్న శరీరం కలిగిన మావటి వాడు పర్వత సమానమైన ఏనుగును తాన లోబరచు కుంటుంన్నాడు కదా..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. *మన మానవ సమాజంలో పరిస్థితులను ఎదిరించి నిలబడాలంటే శరీర బరువు కాదు, బుద్ధి కుశలత ముఖ్యం. కేవలం శరీర దారుఢ్యంతో విజయం సాధించలేము. దీనికి బుద్ధి కుశలత తోడవ్వాలి. శ్రీకృష్ణ వృకోదర (భీమసేన) స్నేహం లాగా. ఈ కారణంగానే కురుక్షేత్రంలో దుర్యోధన వధ జరిగింది. కనుక కార్యసాధనకు, శరీర దారుఢ్యంతో బాటు బుద్ది కుశలత అవసరం* అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు