154.ఆలోచనలు పంచుకోవాలి:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.

పెద్ద తరగతులకు వెళ్ళే కొలది విద్యార్థులు జ్ఞానసముపార్జన దారులు వెతకాలి.విద్య వికసించడానికి ఒక్క పాఠ్యపుస్తక జ్ఞానమే
చాలదు.ఏకాంత పఠనం కూడా కొంత మేరకే ఉపయోగపడుతుంది. విద్యారంగంలో విద్యార్థులుఎదుర్కొంటున్న ఈ సున్నితమైన సమస్యకుపరిష్కార మార్గం చూపే ప్రయత్నమే "ఏకనాథుడు"కథ! కథలోకి వెళ్తే...నిత్యానందుడు అనే గురువుకృష్ణానదీ తీరంలో జ్ఞానవనం పేరుతో ఒక గురుకులం నడుపుతుండేవాడు.అక్కడ చదివే విద్యార్థులు జ్ఞానవంతులై కీర్తి పొందుతారని ప్రతీతి!ఆ నమ్మకం తోనే దూరప్రాంతాల నుంచి కూడా అక్కడ విద్యాభ్యాసం చేయడానికి వచ్చేవారు!ఒకరోజున కళింగ రాజ్యాధిపతి తనకుమారుడిని వెంటబెట్టుకుని జ్ఞానవనానికి వచ్చాడు.నిత్యానందుడికి నమస్కరించి"నేనుకళింగ రాజు సుధీరగజపతిని!ఇతడు నా కుమారుడు.పేరు ఏకనాథుడు. పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కాని తెలివితేటలువికసించలేదు.మీరు నడుపుతున్న జ్ఞానవనం
గురించి విని ఆశతో వచ్చాను.నా కుమారుడుజ్ఞానవంతుడై మంచి పాలనాదక్షుడిగా ఎదగాలనినా అభిలాష!నా కోరిక తీర్చండి!" అని రాజకుమారుడిని అప్పజెప్పాడు.నిత్యానందుడుసరే అన్నాడు. సుధీరగజపతి సంతోషంగాతిరుగుప్రయాణమయ్యాడు.నిత్యానందుడు
వారం రోజులు ఏకనాథుడిని గమనించాడు.ఏకనాథుడు ఏకాంతంగా గడపడానికే ఇష్టపడేవాడు.పాఠం వినినప్పుడు ఎటువంటి సందేహాన్నిఅడిగేవాడు కాదు.ఏ చెట్టు కిందకో వెళ్ళి పాఠాలను వల్లె వేసుకొనేవాడు.తోటి విద్యార్థులతోమాట కలిపేవాడు కాదు.గురుకులం లో ఉన్నగ్రంథాలయంలో ఒకసారి కూడా అడుగు పెట్టలేదు.రాజకుమారుడినన్న గర్వం అనుక్షణం తొణికిసలాడుతుండేది.ఒకరోజు జరిగిన పరీక్షలలోఏకనాథుడు చదువులో వెనుకబడినట్టు తేలింది.తోటి విద్యార్థులు గురువుగారు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలివ్వడంచూసి ఏకనాథుడు నివ్వెరపడ్డాడు.తానెందుకలాజవాబులు చెప్పలేకపోయానని మధనపడిపోయాడు.నిత్యానందుడది గమనించాడు.ఆ రోజు సాయంత్రం వాహ్యాళికిఏకనాథుడిని తీసుకు వెళ్ళాడు. దారిలో "ఏకనాథా!ఈరోజు జరిగిన పరీక్షలలో సమాధానాలు సరిగ్గా చెప్పలేకపోయినందుకుబాధపడుతున్నావు.నీ వేదన నాకు అర్థమయింది.నీలో ఒక లోపం కనిపిస్తుంది. అందుకే వెనకబడ్డావు"అని నిత్యానందుడు అనగానే"నాలోని లోపమేమిటి? అందరి కంటేఎక్కువ సమయమే చదవడానికి వినియోగిస్తున్నాను గురువర్యా!"అని అన్నాడు.అప్పుడు నిత్యానందుడు మందహాసం చేసి"పాఠాలు విన్నాక ఒంటరిగా కూర్చొని చదువుకుంటున్నావు కాని నీ తోటి విద్యార్థులు
పాఠ్యాంశాలపై చేసే చర్చల్లో చేరలేదు. అదే నీలోపం"అన్నాడు. ఏకనాథుడు గురువుగారి మాటలతో ఏకీభవించలేదు.సమయం వృధా
అగునని చేరడంలేదన్నాడు.నిత్యానందుడు దారిపక్కనే ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించి ఏకనాథుడిని పక్కన కూర్చోపెట్టి"శిష్యా!తెలివితేటలు వికసించడానికి ఒక్క పాఠ్యాంశపఠనమే చాలదు!పాఠం మననం చేసుకుంటేసరిపోదు!గడసరి విద్యార్థి చదివి తెలుసుకోవడమేకాకుండా ఇతరుల నుంచి కూడా అదనపువిషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు!నూతిలో కప్ప తనకు కనిపించిన మేరేఆకాశముంటుందని భావిస్తోంది!ఏ పుట్టలో ఏపాముందో?!ఎవరిలో ఎటువంటి తెలివితేటలుంటాయో చెప్పలేం!నలుగురు కూర్చొని పాఠ్యాంశాన్ని చర్చించేటప్పుడు వెయ్యిఆలోచనలు వికసిస్తాయి!వాటి ద్వారా తెలివితేటలు మెరుగవుతాయి!సమయస్ఫూర్తి
పెరుగుతుంది!విజ్ఞానం ఇనుమడిస్తుంది! చర్చల్లోపాల్గొనడంతో పాటు గ్రంథాలయాన్ని కూడావినియోగించుకుంటే నీ జ్ఞాన సముపార్జనకు
మరి కొరతుండదు!"అని హితబోధ చేశాడు.ఏకనాథుడు ఆ రోజు నుంచి తన సరళిని మార్చుకున్నాడు.ఉత్తమ విద్యార్థిగా అచిరకాలంలోనే
పేరు తెచ్చుకొని తండ్రి ఆశను నెరవేర్చాడు! ఇదీకథ!ఈ కథ 2011 జనవరి బాలబాట సంచికలోవచ్చింది.ఇటువంటి కథలు విద్యార్థులకు మార్గదర్శనం చేయగలవని నా అభిప్రాయం!(సశేషం)