వరదల్లో....ఉల్లాసం .......----డా . కె .ఎల్.వి.ప్రసాద్,--హనంకొండ,వరంగల్.

మా ఊరు పుణ్య గోదావరి కి కొద్ది దూరం లో 
ఉంటుంది.మావూరు తూర్పుగోదావరి కి చెందినది .
ఉభయ గోదావరి జిల్లాలను గోదావరి వేరుచేస్తుంది .
గోదావరిమీద అలా ఏర్పడినదే, చించినాడ --దిండి 
బ్రిడ్జి .ఆప్రాంత ప్రజలకు ఈబ్రిడ్జి దేవుడిచ్చిన వరం 
లాంటిది.
మా చిన్నపుడు ,హైద్రాబాద్ /విజయవాడ ,వంటి 
ప్రదేశాలనుండి వచ్చేవారు ,అష్ట కష్టాలు పడి ,
మల్కీపురం -రాజోలు ,మీదుగా ,మాఊరు దిండి కి 
వెళ్ళడం పెద్ద సమస్యగా ఉండేది.నరసాపురంలో 
రైలుదిగాక ,నరసాపురం -సఖినేటి పల్లి రేవులో 
(గోదావరి నది )నాటుపడవలో రేవుదాటి ,సఖినేటి 
పల్లీనుండి ,బస్సు ,జట్కా ,ఒంటెద్దుబండి ,లాంచీ ఇలా ..ఏదోఒకదానిలో ప్రయాణం చేసి ,ఇల్లు చేరే 
సరికి చాల సమయం పట్టేది.ఈ చించినాడ -దిండి 
బ్రిడ్జి ఇప్పుడు మాగ్రామానికి ,ప్రయాణం సులభ ..
తరం చేసింది .
గోదావరి కి ,తరచుగా వరదలు వచ్చేవి .మేము 
చదువుకునే ,ప్రాథమిక పాఠశాల ,మాఇల్లు కూడా 
మునిగిపోయేది .ఇక ,వరద తగ్గిపోయేవరకు ,
నివాసం ఏటిగట్టుమీద ఉండేది.వరదలవల్ల పెద్దలు 
బాధపడుతుంటే ,దాని సంగతి తెలియని మేము 
ఆనందంగా గడిపేవాళ్ళం .వరదలు ,ఎక్కువ కాలం 
ఉండాలని కోరుకునేవాళ్ళం .గ్రామంలో ,వరదనీటిలో 
పడవలు తిరుగుతుంటే ,మేము అరటి బొందల ...
తెప్పలు తయారు చేసి ,వాటిమీద తిరిగే వాళ్ళం .
అదొక గొప్ప జ్ఞాపకం .
ఇప్పుడు ,హనంకొండలో ,స్థిరనివాసం ఏర్పరచు ...
కున్నాక ,వర్షాలు పడినప్పుడెల్లా ,చిన్ననాటి మా ..
ఊరి  వరద లే,గుర్తుకు వస్తాయి.