హైదరాబాద్ ముచ్చట(వీపు చరుపు ): -డా.ఎల్ .వి.ప్రసాద్ .కానేటి .-- హనంకొండ .506004--9866252002--8886991785

అత్యంత క్లిష్టమయిన నాబాల్య దశ ,పెద్దన్నయ్య స్వర్గీయ కె .కె .మీనన్ దగ్గర గడిచింది.మా బంధువుల్లో అప్పటి కి ,అన్నయ్య ఒక్కడే హైదరబాద్ లో ఉండేవాడు .బంధు /స్నేహ వర్గం ఎవరయినా ,ఏదో పనిమీద వస్తూ ,అన్నయ్య ఇంట్లొ దిగేవారు.అప్పట్లో ..ఆ ..రెండు గదుల అద్దె ఇల్లు ఎందరెందరికో ,ఆశ్రయం ఇస్తుండేది.అన్నయ్య ,సహృదయత ,స్నేహ శీలత ,వచ్చిన వారిని ,అచ్చెరువు పొందేలా చేసేది .స్వంత ఖర్చులతో,వాళ్ల పనులు చేసిపెట్టడమే గాక,హైదరాబాదు లోని ,దర్శనీయ స్థలాలకు తీసుకు ..పోయేవాడు.ప్రతి సారీ ..ఆ గుంపులో నేనూ ..ఉండేవాడిని.నా ..డిగ్రీ అయిపోయిన సమయంలో ,నేనూ ..ఒక బృందాన్ని అలా చూడ దగ్గ ప్రదేశాలను 
చూపించాల్సి వచ్చింది.ఆ ..నేపథ్యంలో ....ఒక రోజు ..నెహ్రు జూలాజికల్ పార్క్ కు వెళ్ళవలసి వచ్చింది.ప్రవేశ అనుమతి టికెట్లు కొనుక్కుని లోపలికి ప్రవేశించి ముందుకు సాగుతున్నాం.మా బృందం లో షుమారుగా అయిదుగురం సభ్యులం ఉండి ఉంటాం .జట్టుగా కలసి వెళుతున్నాం కొద్ది దూరం పోయాక ...అర ఫర్లాన్గ్ దూరం లో ..మా లాంటి బృందమే ఒకటి జట్టుగా కలిసి వెళ్తున్నారు.వాళ్ల వెనుక భాగాలే మాకు కనిపిస్తున్నాయ్.అందులొ ఒకతను నా క్లోజ్ ..ఫ్రెండ్ లా కనిపించాడు.నడకను బట్టి 'అతడే 'అని,నిర్దారణ జరిగాక ,అతనిని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను.నాకు ఇష్టమయిన వాళ్లని ,వీపు మీద చరిచి పలకరించడం నాకు బాగ ..అలవాటు.ఇందులో ఆడ /మగ ,తేడాలేదు.నానడకలో స్పీడు పెంచి ,అతని వెనుకగా వెళ్లి అతని వీపుమీద ,గట్టిగా చరిచాను.అతను క్షణం ఆశ్చర్యానికి లోనై,వెనక్కి తిరిగి సీరియస్ గా ..నా ..ముఖంలో ముఖం పెట్టి  చూస్తున్నాడు.నాకు షాక్ అయినంత పని అయింది.సిగ్గుతొ తల దించుకున్నాను.క్షణం పాటు నొరు కదపలేక పొయాను.తరువాత వంద సార్లైనా 'సారీ ...' చెప్పి వుంటాను.అతను మంచి మనస్సుతో నన్ను ..క్షమించి వదిలేసాడు.నేను కూడా ..వెనక నుండి వీఁపు చరచడం అనే ..అలవాటును తగ్గించుకున్నాను.ఆ..రోజు గుర్తుకు 
వచ్చినప్పుడల్లా ,వళ్ళు జలధరిస్తుంటుంది .