మంచివాడు మిత్రుడయితే---రావిపల్లి వాసుదేవరావు పార్వతీపురం ఫోన్ నెంబర్ .9441713136.

మంచివాడు మిత్రుడైతే
చేయూతను అందించును
మధురమైన మాటలతో
ఓదార్పును చేకూర్చును


మంచివాడు మిత్రుడయితే
చెడునడతను మార్చును
కష్టమును తీర్చుటలో
బాసటగా నిలుచును


మంచివాడు మిత్రుడయితే
మంచితనము నింపును
భేదభావం చూపక
మమతలను పంచును


మంచివాడు మిత్రుడయితే
ఆపదలో ఆదుకొనును
సరియైన సమయానికి
తగిన సలహా ఇచ్చును


మంచివాడు మిత్రుడయితే
సంతోషం చేకూర్చును
కలిమిలేములలోన
కడవరకు తోడుండును


మంచివాడు మిత్రుడయితే
మన గెలుపును కోరును
లోపాలను విప్పిచెప్పి
మంచి బాట చూపును