నారికేళం .--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ ,వరంగల్ -9866252002--8886991785.

కోనసీమలో 
కొబ్బరి చెట్టు ,
చూసేదానికి 
కేరళ తీసి కట్టు !


కొబ్బరి ఆకులు 
పచ్చివైతే ...
చాపల అల్లిక 
సరదాగుంటది ,!


ఎండిన కొబ్బరి 
ఆకులే 
ఇళ్లపై పరిచే ...
రక్షక గొడుగులు !


కొబ్బరి ఈనెలు 
ఈనల చీపుళ్లుగా 
ముస్తాబై 
ఇంటి శుభ్రతకు 
తోడ్పడతాయి !


కొబ్బరి బొండం 
అనగానే ...
వేసవికాలం 
గుర్తొస్తుంది ,
కొబ్బరి నీళ్లు ...
తాగామంటే ..
శక్తిని మించి న శక్తి 
శరీరానికి అందుతుంది !


కమ్మగ -తియ్యగా 
రుచిగా ఉండే ...
కొబ్బరిమీగడ 
పిల్లలకెంతో ...
ప్రీతికరం ....!


కొబ్బరి పాలతో 
కొబ్బరి అన్నం 
బిర్యానీతో ...
సరిసమానం !


కొబ్బరి పచ్చడి ,
కొబ్బరి స్వీటు 
ఒకటా ..రెండా ..
ఎన్నెన్ని రకాలు !


కొబ్బరినూనె 
కొందరికైతే ...
వంటనూనె ,
అందరి తలలకు 
కేశవర్ధిని .....
వంటి మసాజుకు 
ఇంపైన తైలం !


కొబ్బరిపీచుతో 
సంచులు ...
కాళ్లు తుడుచుకునే 
పట్టాలు ....
నులకతాళ్లు -మోకులు ,
ఎన్నెన్నో అవసరాలకు 
అందివచ్చే వస్తువులు !


ఏమని చెప్పను ?
ఎన్నని చెప్పను ?
కొనసీమ జనానికి 
కొబ్బరి చెట్టే ...
కొండంత అండ !


ఆ ..ప్రాంతం 
చూడకుంటె ...
బ్రతుకే -----
కదలని బండ....!!