ఉత్తరం ..!--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-- హనంకొండ .--9866252002-8886991785

ఉత్తరం ..ఉత్తరం ..ఉత్తరం ,
పోస్టుమాన్ కేక వినగానే ,
పరిగెత్తుకొచ్చి 
అందుకున్న సందర్భాలు ,
కాలగర్బంలో ..
కలిసిపోతున్న సమయం ,
కేవలం ఙ్నాపకాలుగా 
మిగిలిపోతున్న వైనం ..!


ఉత్తరం వచ్చిందంటే ,
ఒక బంధువు ..
మనింటికొచ్చినట్టు ,


ఒక స్నేహితుడు ..
ఆప్యాయంగా ..
పలకరించినట్టు ,


అమ్మ _నాన్నల అశీస్సులు 
అందినట్టు !


ఒక సంతోష వార్తతో ,
ఒళ్ళు కితకితలు 
పెట్టినట్టు ,


ఒక విషాదవార్త 
బాధగా మోసుకొచ్చినట్టు !


ఎదురు చూచిన లేఖ 
చేతికందితే ...
మనసును 
మరో లోకంలో 
విహరింప జేసే ..
ప్రియుడి ప్రేమ 
పలకరింపు కావచ్చు,
ప్రియురాలు పంపిన ,
ముద్దుల మూట కావచ్చు !


విశయం ఏదైనా ..
ఆ ..నాడు 
ఉత్తరం అందుకోవటం 
అక్షరాల్లో చెప్పలేని మోజు ,
తక్షణం ..
జవాబు రాయటం 
బాధ్యత నేర్పిన క్రేజు !


ఆదునిక సమాజంలో 
ఉహించని ఆవిష్కరణలు 
అందుబాటులోకి ...
రావడం సహజం ...
అలాగని ..
ఉన్నసదుపాయాలు 
వదులుకోడం మూర్ఖత్వం !


దేని ప్రత్యేకత దానిది ,
ఉపయోగించుకోవడం ,
అందిపుచ్చుకోవడం ,
విజ్ఞుల వివేకానికే వదిలేద్దాం !


ఉత్తరం 
ఎక్కడికీ పోలేదు ,
మనమే ఉత్తరాన్ని 
తరిమేస్తున్నాం ...


ఉత్తరం ...
హృదయ స్పందనలను,
అక్షరరూపంలో మోసుకొచ్చే 
సున్నితమైన సాధనం.


మనసులోని భావాలను ,
ఆవలి వైపుకు చేర్చగల 
ముచ్చటైన ఉత్తమ 
అక్షర వాహనం 'ఉత్తరం ' !!