తిక ..మక ...!!--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్ .--9866252002--8886991785

వానలమ్మా ..
వానలూ ...
మాయదారి 
వానలు ...
కురవమంటే 
కురవవు ....
అక్కరలో -
కాన రావు...!


మొదలయితే 
ఆగవు .....
పంటపనులు,
సాగవు ....!


ఉరుములు -
మెరుపులతో ,
మబ్బులతో ..
నిండుతుంది 
ఆకాశం ...!


కుండపోత -
వర్షాలతో ..
పండిన పంటలు 
వృథా ..వృథా ...
రైతన్న కష్టానికి 
మిగిలేది ....
వ్యధ ...వ్యధ ...!


అకాల వ ర్షాలతో ,
అంతానష్టమే ..
అలా అయి తే,
బ్రతకడం కష్టమే!


ఋతువులు 
రంగు--
 మార్చుకుంటున్నాయ్ !


మనిషిని ...
తికమక లో,
 పడేస్తున్నాయ్ !!